సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ugram OTT release: నరేష్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ కూడా ఓటిటి లో వచ్చేస్తోంది... ఎప్పుడు, ఎక్కడ అంటే...

ABN, First Publish Date - 2023-05-31T17:01:24+05:30

నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా 'ఉగ్రం'. ఇది ఇప్పుడు ఓటిటి లో వచ్చేస్తోంది, థియేటర్ లో చూడని వాళ్ళు, ఈ సినిమాని ఇంట్లో చూసుకోవచ్చు. ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ వస్తోందో చూడండి.

A still from Ugram
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరేష్ (AllariNaresh), దర్శకుడు విజయ్ కనకమేడల (VijayKanakamedala) ఇద్దరూ ఇంతకు ముందు 'నాంది' #Naandi అనే సినిమా చేశారు. అది మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది, అలాగే బాగానే ఆడింది కూడా. ఆ తరువాత ఆ ఇద్దరూ మళ్ళీ 'ఉగ్రం' #Ugram అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమాలో నరేష్ కి మంచి పేరు వచ్చింది, కానీ కమర్షియల్ గా అంత పే చెయ్యలేదు అని అంటారు అనలిస్ట్స్. కానీ సినిమా క్రిటిక్స్ కి నచ్చింది. ఈ సినిమాలో నరేష్ నటన ఇంకో స్థాయిలో వుంది, అతని విశ్వరూపం ఇందులో చూడొచ్చు అని అందరూ అన్నారు.

ఇప్పుడు ఈ 'ఉగ్రం' సినిమా ఓటిటి లో వచ్చేస్తోంది. ఇంతకీ ఎందులో వస్తోంది అంటే, అమెజాన్ ప్రైమ్ (AmazonPrimeVideo) లో జూన్ 2 (June 2) న స్ట్రీమింగ్ అవుతోంది. #UgramOnOTT ఈ సినిమాని థియేటర్ లో ఎవరైనా చూడని వాళ్ళుంటే ఇప్పుడు ఇంట్లో హాయిగా చూడొచ్చు. అయితే ఈ సినిమా చూడదగ్గ సినిమానే. ఇందులో మిర్నా మీనన్ (MirnaMenon) కథానాయకురాలిగా నటించింది.

ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. దర్శకుడు విజయ్ కనకమేడల మంచి కాన్సెప్ట్ కథలను ఎంచుకుంటున్నాడు. ఈ సినిమా కూడా అలానే సాగుతుంది. నరేష్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఇందులో బాగా చేశారు. అతని భార్యగా మిర్నా మీనన్ కూడా బాగా చేసింది. మిగతావాళ్ళు కూడా వాళ్ళ పాత్రలకు తగ్గట్టు నటించారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు బాగా డిజైన్ చేశారు.

ఇది కూడా చదవండి:

Ugram Film Review: అల్లరి నరేష్ కొత్త అవతారం ఎలా ఉందంటే..

Updated Date - 2023-05-31T17:01:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!