Dhootha: గూస్ బంప్స్ తెచ్చేలా.. నాగచైతన్య దూత ట్రైలర్

ABN , First Publish Date - 2023-11-23T10:25:03+05:30 IST

అక్కినేని నాగ‌చైత‌న్య తొలిసారిగా న‌టించిన వెబ్‌సిరీస్‌ దూత. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించింది. ఇప్ప‌టికే సిరీస్‌కు సంబంధించి లుక్స్ విడుద‌ల చేయ‌గా అభిమానుల అటెన్ష‌న్‌ను గ్రాబ్ చేశాయి.

Dhootha: గూస్ బంప్స్ తెచ్చేలా.. నాగచైతన్య దూత ట్రైలర్
dhootha

అక్కినేని నాగ‌చైత‌న్య (Akkineni Naga Chaitanya) తొలిసారిగా న‌టించిన వెబ్‌సిరీస్‌ దూత (Dhootha). అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime) నిర్మించింది. గ‌త సంవ‌త్స‌ర‌మే విడుద‌ల కావ‌లిసిన ఈ సిరీస్ కొన్ని అనివార్య కార‌ణాల‌తో వాయిదా ప‌డగా మ‌ళ్లీ ఇన్నాళ్లకు మోక్షం ల‌భించింది. ఇప్ప‌టికే సిరీస్‌కు సంబంధించి లుక్స్ విడుద‌ల చేయ‌గా అభిమానుల అటెన్ష‌న్‌ను గ్రాబ్ చేశాయి.

ఈ క్ర‌మంలోనే మేక‌ర్స్ నాగ చైత‌న్య‌తో ప్ర‌మోష‌న్స్ ప్రారంభిచ‌డ‌మే కాక సిరీస్‌, ట్రైల‌ర్ విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించి గురువారం నాగ‌చైత‌న్య జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ‘లెక్కపెట్టలేనన్ని వాస్తవాలు, చెప్పలేని రహస్యాలు వాటిని కనుగొనేందుకు ఓ వ్యక్తి చేసిన పోరాటం ఇది’ అంటూ సిరీస్ గురించి క్లుప్తంగా వివరించారు. సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో వచ్చిన ఈ ట్రైలర్ అధ్యంతం ఆకట్టుకుంది. ఇది చూసిన వారికి సిరీస్ తప్పక చూడాల్సిందే అన్నట్టుగా ఈ ట్రైలర్ ను తీర్చిదిద్ధారు.


దాదాపు రూ. 40కోట్లతో రూపొందిన ఈ సిరీస్‌కు మ‌నం , 24 వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ ఇచ్చిన విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్రియా భ‌వాని శంక‌ర్, పార్వ‌తి, ప్రాచీ దేశాయ్‌, త‌రుణ్ భాస్క‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. డిసెంబ‌ర్ 1 నుంచి ఈ సిరీస్‌ను అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ఈ సీజ‌న్1.. 40నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌గా 5 భాషలలో రానునట్లు స‌మాచారం. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

Updated Date - 2023-11-23T10:57:39+05:30 IST