King of Kotha in OTT: దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా ఓటిటి లో చూసుకోవచ్చు

ABN , First Publish Date - 2023-09-27T11:25:44+05:30 IST

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, ఐశ్వర్య లక్ష్మి కథానాయకురాలిగా నటించిన 'కింగ్ అఫ్ కొత్త' త్వరలోనే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి అభిలాష్ జోషి దర్శకుడు, ఇది ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా.

King of Kotha in OTT: దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా ఓటిటి లో చూసుకోవచ్చు
Dulquer Salman from King of Kotha film

దుల్కర్ సల్మాన్ (DilquerSalman) నటించిన 'కింగ్ అఫ్ కొత్త' #KingOfKotha ఆగస్టు 24న థియేటర్స్ లో విడుదలైంది. మళయాళంలోనే కాకుండా, ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రధాన భాషలు అన్నిటిలోనూ విడుదలైంది, తెలుగులో కూడా విడుదలైంది. దీనికి దర్శకుడు అభిలాష్ జోషి (AbhilashJoshi), ఇది ఒక పీరియడ్ డ్రామా గా తెరకెక్కించారు. ఈ సినిమా కథ నేపధ్యం కూడా ఒక సిటీ లో గ్యాంగ్ ల మధ్య జరిగే యుద్ధం. అయితే ఈ కథ చెప్పే విధానం చాలా స్లోగా ఉందని, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్పితే సినిమాలో పెద్ద విశేషం ఏమీ లేదని ఈ సినిమా విడుదల అయినప్పుడు చెప్పారు.

ఈ తెలుగు సినిమాకి రానా దగ్గుబాటి (RanaDaggubati) కూడా ప్రచారం చేసాడు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి (AishwaryaLakshmi) కథానాయకురాలి కాగా, చాలామంది మలయాళం నటులు వున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఈనెల అంటే సెప్టెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ #DisneyPlusHotStar లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది ఒక్క మలయాళం భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది అని మాత్రం చెపుతున్నారు. మరి మిగతా భాషల్లో ఎప్పుడు అనేది త్వరలోనే తెలుస్తుంది అని కూడా అంటున్నారు.

kingofkotha2.jpg

ఎందుకంటే ఈ సినిమా ఒరిజినల్ గా మళయాళంలోనే తీశారు, చాలామంది మలయాళం నటులు కనపడతారు ఇందులో షబీర్ (Shabeer), ప్రసన్న (Prasanna), గోకుల్ సురేష్ (GokulSuresh), నైలా ఉష (NylaUsha) కూడా నటించారు. ఈ సినిమా కొత్త అనే వూరిలో గ్యాంగ్ ల మధ్య జరిగే పోరాటాలు, ఒకరి మీద ఒకరు ఎలా ఆధిపత్యం సాధించటం కోసం ఎటువంటి ఎత్తులు పన్నారు అన్నది ఇందులో చెప్పారు. తీసుకున్న కథ నేపధ్యం మంచిదే కానీ అది చెప్పే విధానమే ప్రేక్షకులని నిరాశ పరిచింది అన్నారు.

ఇదీ చదవండి:

King of Kotha Review: ‘కింగ్ ఆఫ్ రోత’!

Updated Date - 2023-09-27T11:25:44+05:30 IST