The Village: ఓటీటీలోకి హ‌ర్రర్, థ్రిల్ల‌ర్‌.. వెబ్‌ సిరీస్‌తో ఆర్య ఆరంగేట్రం

ABN , First Publish Date - 2023-11-09T15:53:03+05:30 IST

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మైంది. అంతేగాక త‌మిళ స్టార్ న‌టుడు హీరో ఆర్య దీని ద్వారా ఓటీటీలోకి ఆరంగేట్రం చేస్తున్నాడు. హ‌ర్రర్, థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ ‘ది విలేజ్’ అనే వెబ్‌ సిరీస్‌ ఫ‌స్ట్‌లుక్, టీజ‌ర్‌లు ఇప్పటికే విడుదలై సిరీస్‌పై అంచ‌నాలు మ‌రింతగా పెంచేస్తున్నాయి.

The Village: ఓటీటీలోకి హ‌ర్రర్, థ్రిల్ల‌ర్‌.. వెబ్‌ సిరీస్‌తో ఆర్య ఆరంగేట్రం
arya

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మైంది. అంతేగాక త‌మిళ స్టార్ న‌టుడు హీరో ఆర్య (Arya) ఈ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఆరంగేట్రం చేస్తున్నాడు. హ‌ర్రర్, థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ ‘ది విలేజ్’ (The Village) అనే వెబ్‌ సిరీస్‌ ఫ‌స్ట్‌లుక్, టీజ‌ర్‌లు ఇప్పటికే విడుదలై సిరీస్‌పై అంచ‌నాలు మ‌రింతగా పెంచేస్తున్నాయి. న‌వంబ‌ర్ 24న అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈరోజు (న‌వంబ‌ర్ 9)న విడుద‌ల చేసిన 30 సెక‌న్ల‌ అఫీసియ‌ల్‌ ట్రైల‌ర్ చూసిన వారికి గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. ద‌య్యాలు, పిశాచాలు దాడులు చేయ‌డం వాటిపై మ‌న‌షులు తిరిగి పోరాటం చేయ‌డం వంటి స‌న్నివేశాలు భ‌యం కల్పించేలా ఉన్నాయి.

ఓ అనుమానాస్పద‌ గ్రామంలో చిక్కుకుపోయిన త‌న కుటుంబ స‌భ్యుల‌ను వెత‌క‌డానికి వెళ్లిన‌ ఆర్య‌, ఆయ‌న స్నేహితుల‌కు ఎదురైన‌ అనుభ‌వాల నేప‌థ్యంలో పూర్తి హ‌ర్రర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సిరీస్‌కు మిలింద్ రౌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఆర్య‌కు జోడీగా దివ్యా పిళ్లై న‌టించింది.


వ‌రుడు సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఆర్య ఆ త‌ర్వాత ‘రాజా రాణి, క్రేజీ, నేనే అంబానీ, టెడ్డి, సార్ప‌ట్ట‌, కెప్టెన్’ వంటి డ‌బ్బింగ్ సినిమాల‌తో ఇక్క‌డి వారికి ద‌గ్గ‌ర‌య్యాడు. త‌మిళంలో త‌న‌దైన శైలిలో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ న‌టుడు త్వ‌ర‌లో వెంక‌టేశ్ హీరోగా వ‌స్తున్న ‘సైంథ‌వ్’ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

Updated Date - 2023-11-09T16:11:48+05:30 IST