Vyooham OTT: ఓటీటీ స్ట్రీమింగ్‌కు.. ‘అన్నపూర్ణ’ వారి ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌

ABN , First Publish Date - 2023-12-11T18:30:26+05:30 IST

డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో స‌రికొత్త తెలుగు వెబ్ సిరీస్ సిద్ధ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక‌టి రెండు మిన‌హా స్ట్రెయిట్ తెలుగు సిరీస్‌లే లేని అమెజాన్ తాజాగా ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ వెబ్ సిరీస్ వ్యూహంను విడుద‌ల చేసేందుకు రెడీ అవుతున్న‌ది.

Vyooham OTT: ఓటీటీ స్ట్రీమింగ్‌కు.. ‘అన్నపూర్ణ’ వారి ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌
vyooham series

డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో స‌రికొత్త తెలుగు వెబ్ సిరీస్ సిద్ధ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక‌టి రెండు మిన‌హా స్ట్రెయిట్ తెలుగు సిరీస్‌లే లేని అమెజాన్ తాజాగా ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వ‌రుస‌గా తెలుగు సిరీస్‌ల‌ను విడుద‌ల చేస్తూ ఆక‌ట్టుకుంటున్న‌ది. తాజాగా స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన‌ త‌మిళ న‌టుడు ఆర్య న‌టించిన డ‌బ్బింగ్ సిరీస్ ది విలేజ్, నాగ చైత‌న్య దూత వెబ్ సిరీస్‌లు మంచి విజ‌యం సాధించాయి. ఈ కోవ‌లోనే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ వెబ్ సిరీస్ వ్యూహం (Vyooham)ను విడుద‌ల చేసేందుకు రెడీ అవుతున్న‌ది.

అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌కు శశికాంత్ శ్రీవైష్ణవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఈ న‌గ‌రానికి ఏమైంది ఫేం సాయి సుశాంత్ రెడ్డి(Sai SushanthR), చైతన్య కృష్ణ, ప్రీతి అశ్రాని (Preethi Asrani), పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్ (Ravindra Vijay), శశాంక్ సిద్దంశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ను డిసెంబర్‌ 14న అమెజాన్‌ ప్రైమ్ వీడియో(PrimeVideoIN)లో స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌స్తున్న‌ట్లు మేక‌ర్స్ సోమ‌వారం (డిసెంబర్‌ 11)న‌ సోష‌ల్ మీడియా వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించారు.


ఇదిలాఉండ‌గా ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌లు వెబ్ సిరీస్‌ల‌కు అల‌వాటు ప‌డుతుండ‌డంతో ఓటీటీ సంస్థ‌లు కూడా నెమ్మ‌దిగా వాటిపై బాగా ఫోక‌స్ పెడుతున్నాయి.ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్‌ల విష‌యంలో నెట్‌ఫ్లిక్స్ క‌న్నా చాలా వెన‌క‌బ‌డిన అమెజాన్ (PrimeVideoIN) ప్ర‌స్తుతం వీటిపై దృష్టి పెట్టి ప్రేక్ష‌కుల అభిరుచికి అనుగుణంగా వినూత్న కంటెంట్‌తో వ‌స్తూ సినీ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. మ‌రి ఇప్పుడు వ‌స్తున్న స్ట్రెయిట్ తెలుగు వెబ్ సిరీస్ ఏ రేంజ్‌లో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుందో చూడాలి.

Updated Date - 2023-12-14T20:41:09+05:30 IST