కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pro Kabaddi: క్రికెట్ హంగామా ముగిసింది.. ఇప్పుడిదే సీజన్.. బాలయ్య తొడగొట్టేశాడు

ABN, First Publish Date - 2023-11-21T15:09:49+05:30

ఆదివారం వరకు క్రికెట్ వరల్డ్ కప్ హంగామా దేశమంతా నడిచింది. భారత జట్టు లీగ్ దశలో అన్ని జట్లను మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో కూడా విజయం సాధించి అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఫైనల్‌లో చేతులెత్తేసింది. క్రికెట్ హంగామా ముగియడంతో ఇప్పుడు ప్రో కబడ్డీ సీజన్ మొదలైంది. ఈ సీజన్‌‌ను బాలయ్య ప్రమోట్ చేస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Balayya Promotes Pro Kabaddi

ఆదివారం వరకు క్రికెట్ వరల్డ్ కప్ (Cricket World Cup 2023) హంగామా దేశమంతా నడిచింది. భారత జట్టు లీగ్ దశలో అన్ని జట్లను మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో కూడా విజయం సాధించి అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా 10 మ్యాచ్‌లలో విజయ విహారం చేసిన టీమిండియా.. ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది. 140 కోట్ల భారతీయుల ఆశలపై నీళ్లు చల్లేసింది. ఫలితంగా 6వ సారి ఆసీస్‌ క్రికెట్ వరల్డ్ కప్‌ను ముద్దాడింది. మొత్తం అక్టోబర్ 5న మొదలైన ఈ సమరం.. నవంబర్ 19తో ముగిసింది. టీమిండియా వరకు ఆరంభం అదిరితే.. ముగింపు మాత్రం కన్నీళ్లనే మిగిల్చింది. ఇక ఇప్పుడు ప్రో కబడ్డీ సీజన్ మొదలైంది. 12 టీమ్స్‌తో ప్రో కబడ్డీ సీజన్ 10 లీగ్ డిసెంబర్ 2న గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. (Pro Kabaddi League)

క్రికెట్ ప్రపంచకప్‌ని ప్రసారం చేసిన డిస్నీ ప్లస్ హాట్‌స్టారే ఈ ప్రో కబడ్డీ (#ProKabaddi) సీజన్‌ని కూడా ప్రసారం చేయబోతుంది. ఈ సీజన్‌ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. స్టార్ సెలబ్రిటీలు ఈ సీజన్‌ను ప్రమోట్ చేసేందుకు బరిలోకి దిగారు. మరీ ముఖ్యంగా నటసింహం నందమూరి బాలయ్య (Nandamuri Balayya) లే పంగా అంటూ తొడగొట్టి మరీ ఛాలెంజ్ విసురుతున్నాడు. బాలయ్యతో పాటు మరో ఇద్దరు హీరోలు ఈ సీజన్‌ను ప్రమోట్ చేయబోతున్నారు. కిచ్చా సుదీప్, టైగర్ ష్రాఫ్, బాలయ్యతో చేతులు కలుపుతున్నారు. (#PKLOnStar)


ప్రో కబడ్డీ ప్రమోషన్స్ నిమిత్తం వీరు ముగ్గురితో ఓ యాడ్‌ని డిజైన్ చేశారు. ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇందులో బాలకృష్ణ (Balakrishna), కిచ్చా సుదీప్ (Kichcha Sudeep), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)) గుర్రాల మీద యోధుల్లాగా రావడం, కబడ్డీ కోర్టును నిప్పుతో గీసి, అందులో కబడ్డీ ఆడినట్టు‌గా ఫైర్‌ఫుల్‌గా చూపించారు. గూజ్‌బంప్స్ తెప్పిస్తున్న ఈ వీడియో చివర్లో బాలయ్య గెలిచి.. మీసం మెలేసి మరీ తొడగొట్టినట్టు చూపించారు. బాలయ్య లుక్ యోధుడి గెటప్‌లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని తలపించింది. ఈ వీడియోతో పాటు ‘‘కబడ్డీ.. మన మట్టిలో పుట్టిన ఆట, మన తెలుగువాడి పౌరుషాన్ని తెలిపే ఆట, కండల బలమే ఆయుధంగా.. మైదానమే రణస్థలంగా.. పోరాడే ఈ దమ్మున్న ఆటను అస్సలు మిస్ కావద్దు’’ అంటూ ప్రచారాన్ని మొదలెట్టారు. (#PKLSeason10)


ఇవి కూడా చదవండి:

====================

*Allu Aravind: వ్యక్తుల్ని కాదు.. వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ఇది

*********************************

*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లిలో సినీ ప్రముఖుల సందడి


*****************************

*Yatra Raja: ధనుష్‌ పెద్ద కుమారుడికి జరిమానా.. ఎందుకంటే?

********************************

Updated Date - 2023-11-21T15:09:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!