Oppenheimer : ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం

ABN , First Publish Date - 2023-05-09T13:06:21+05:30 IST

క్రిస్టోఫర్‌ నోలన్‌ హాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరు. 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు పదమూడే. అయినా ఆ సినిమా ప్రభావం ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తుంటుంది.

Oppenheimer : ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం

క్రిస్టోఫర్‌ నోలన్‌ (Christopher Nolan) హాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరు. 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు పదమూడే. అయినా ఆ సినిమా ప్రభావం ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తుంటుంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓపెన్‌హైమర్‌’(Oppenheimer). ఇది తన గత చిత్రాల జానర్‌ కాదు. బలమైన కథ. అణుబాంబ్‌ లాంటి సినిమా. కథా నేపథ్యం కూడా అణుబాంబు పైనే అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. అణుబాంబ్‌ పితామహుడుగా పేరున్న అమెరికా భౌతిక శాస్త్రవేత్త ‘జులీయస్‌ రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 1942-1946లో అణ్వాయుధ సృష్టికి సంబంధించిన ప్రభుత్వ ప్రాజెక్ట్‌ ‘మాన్‌హట్టన్‌’కు (Manhattan Project) సహకరించిన వారిలో రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌ ఒకరు. అణుబాంబు తయారీకి వారు ఎంతగా శ్రమించారు? అసలు అణుబాంబు ఎలా తయారైంది? ఎలా ప్రయోగించారు? అనే అంశాలతో నోలన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘అణుబాంబు’ తయారీకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించినట్లుగా తెలుస్తోంది. నేషనల్‌ ఎమర్జెన్సీ అంటూ మొదలైన ట్రైలర్‌.. న్యూక్లియర్‌ బాంబ్‌ తయారీ, ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారన్నది ట్రైలర్‌ చూపించారు. అసలు ఈ సినిమాలో ఏముందో తెలుసుకోవాలంటే జూలై 21 వరకూ వేచి చూడాల్సిందే. కిల్లియన్‌ మర్ఫీ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాను నోలన్‌ కేవలం నాలుగు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేశారని, సీజీఐ ఎఫెక్ట్‌ లేకుండా బాంబు తయారీ, పేలుడు సీన్లను చిత్రీకరించడమనేది విశేషంగా చెప్పుకోవాలి.

Updated Date - 2023-05-09T13:06:21+05:30 IST