Matthew Perry: ప్ర‌ముఖ‌ న‌టుడు అనుమానాస్ప‌ద మృతి.. మ‌హేశ్‌బాబు, బాలీవుడ్ సంతాపం

ABN , First Publish Date - 2023-10-29T18:08:11+05:30 IST

ప్ర‌ముఖ అమెరిక‌న్‌, క‌మెడియ‌న్ న‌టుడు (ఫ్రెండ్స్‌) ఫేమ్ మాథ్యూ ఫెర్రీ అనుమానాస్ప‌ద స్థితిలో క‌న్నుమూశాడు. మ‌హేశ్‌బాబు, స‌మంతల‌తో పాటు బాలీవుడ్ న‌టులు అక్ష‌య్‌కుమార్‌, కియారా, సిద్ధార్ధ‌క‌పూర్ జంట‌, ర‌ణ్వీర్ సింగ్‌, క‌రీనాక‌పూర్ ఇత‌ర న‌టులు త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు.

Matthew Perry: ప్ర‌ముఖ‌ న‌టుడు అనుమానాస్ప‌ద మృతి.. మ‌హేశ్‌బాబు, బాలీవుడ్ సంతాపం
friends

సోష‌ల్‌మీడియా క‌న్నీటిసంద్ర‌మైంది. త‌మ అభిమాన న‌టుడి మ‌ర‌ణాన్ని న‌మ్మ‌లేక రిప్ లెజెండ్ అనే అంటూ ఫ్యాన్స్‌ పోస్టుల‌తో నిండిపోయింది. విష‌యానికి వ‌స్తే ప్ర‌ముఖ అమెరిక‌న్‌, క‌మెడియ‌న్ న‌టుడు (ఫ్రెండ్స్‌) ఫేమ్ మాథ్యూ ఫెర్రీ(Matthew Perry) అనుమానాస్ప‌ద స్థితిలో క‌న్నుమూశాడు. లాస్ ఎంజెల్స్‌లో త‌న ఇంటిలోని బాత్ ట‌బ్‌లో శ‌నివారం అచేత‌నంగా ప‌డి ఉండ‌డాన్ని గ‌మ‌నించిన‌ అసిస్టెంట్స్ పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా వారు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని పెర్రీ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఓపియాయిడ్ అనే డ్ర‌గ్ అధికంగా వాడ‌డం వ‌ళ్ల పెద్ద ప్రేగు ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చి ఈ మ‌ర‌ణం సంభ‌వించిన‌ట్లు అక్క‌డి వైద్యులు తెలిపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

friends.jpg

ఫెర్రీ 1969లో కెన‌డాలో జ‌న్మించగా, ఆయ‌న‌ త‌ల్లిదండ్రులు ఆయ‌న ఏడాది వ‌య‌స్సులోనే విడాకులు తీసుకోవ‌డంతో 15 సంవ‌త్స‌రాలు త‌ల్లి వ‌ద్దే ఉంటూ అక్క‌డే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అనంత‌రం తండ్రి వెంట లాస్ ఎంజెల్స్ చేసుకుని న‌ట‌న వైపు మొగ్గు చూపి సినిమాలు, ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించి పేరు సంపాదించాడు. ముఖ్యంగా 1994లో ప్రారంభ‌మై 2004 వరకు కొన‌సాగిన ఫ్రెండ్స్(Friends) సిరీస్ అత‌ని జీవితాన్నే మార్చివేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా అశేష అభిమానుల‌ను తెచ్చి పెట్టింది. వీటితో పాటు ఆయ‌న సిడ్నీ, కెరోలిన్ ఇన్ సిటీ వంటి దాదాపు 50 టెలివిజ‌న్ సిరీస్‌లు, 14 హాలీవుడ్ సినిమాల‌లో న‌టించి అమెరికాలోనే అధిక రెమ్యున‌రేష‌న్ తీసుకునే టెలివిజ‌న్ న‌టుడిగా మారాడు.


అయితే ఆయ‌న కేరీర్‌కు బాగా పేరు తీసుకువ‌చ్చిన ఫ్రెండ్స్‌ సిరీస్‌కు కొన‌సాగింపుగా ఇటీవ‌ల ఫ్రెండ్స్ రీ యూనియ‌న్ అనే మ‌రో కొత్త సిరీస్‌లోనూ న‌టించ‌గా అది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది. కాగా ఇత‌నికి ఉన్న‌అభిమానుల్లో ఎక్కువ‌ శాతం మంది టాప్ మోస్ట్ సెట‌బ్రీటీలే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని సినీ ఇండ‌స్ట్రీల న‌టులు పెర్రీకి ఫ్యాన్సే అంటే అతిశ‌యోక్తి కాదు. ఈ క్ర‌మంలోనే పెర్రీ మ‌ర‌ణాన్ని చాలామంది సెల‌బ్రిటీలు జీర్ణించులేక‌పోతున్నారు. షోష‌ల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ త‌మ సానుభూతిని తెలియ‌జేస్తున్నారు. ముఖ్యంగా మ‌న తెలుగునాట కూడా మ‌హేశ్‌బాబు, వెంటకటేశ్, సమంతల‌తో పాటు బాలీవుడ్ న‌టులు అక్ష‌య్‌కుమార్‌, కియారా, సిద్ధార్ధ‌క‌పూర్ జంట‌, ర‌ణ్వీర్ సింగ్‌, క‌రీనాక‌పూర్ ఇత‌ర న‌టులు త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు.

Updated Date - 2023-10-29T18:45:02+05:30 IST