Mega Star and King Nag: తగ్గేదే లే! ఒక్కొక్కరికి ముగ్గురు హీరోయిన్స్ అంట!

ABN , First Publish Date - 2023-09-19T11:26:23+05:30 IST

మెగా స్టార్ చిరంజీవి ఒక ఫాంటసీ కథ నేపథ్యంలో దర్శకుడు వసిష్ఠ మల్లాదితో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, అలాగే కింగ్ నాగార్జున 'నా సామి రంగ' సినిమా కొత్త దర్శకుడు విజయ్ బిన్నీతో చేస్తున్నారు. ఈ ఇద్దరి సినిమాల్లో కథానాయికలు ఒక్కొక్కరి ఎంతమందో తెలుసా...

Mega Star and King Nag: తగ్గేదే లే! ఒక్కొక్కరికి ముగ్గురు హీరోయిన్స్ అంట!
Mega Star Chiranjeevi and King Nagarjuna

మెగాస్టార్ చిరంజీవి(MegaStar Chiranjeevi), కింగ్ నాగార్జున (NagarjunaAkkineni) ఇద్దరూ ఆరు పదుల వయసు దాటినా వారే. ఇప్పుడు ఇద్దరూ మాస్ సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి 'వాల్తేర్ వీరయ్య' #WaltairVeerayya తో పెద్ద హిట్ కొట్టారు, అలాగే తదుపరి సినిమా 'భోళాశంకర్' #BholaaShankar ఫ్లాపు అయింది. నాగార్జున అయితే ఒక మంచి హిట్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఇప్పుడు తమ తదుపరి సినిమాల మీద దృష్టి సారించారు. నాగార్జున 'నా సామి రంగ' #NaaSaamiRanga అనే సినిమాతో విజయ్ బిన్నీ (VijayBinni) అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు, ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. అయితే ఈ సినిమాలో నాగార్జున పక్కన ముగ్గురు కథానాయికలు వుంటారు అని తెలుస్తోంది.

kingnagarjuna.jpg

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (KajalAggarwal), మానస వారణాసి (ManasaVaranasi), ఇషిక రంగనాథ్ (AshikaRanganath) ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని అంటున్నారు. ఈ కథకి అనుగుణంగా ఈ ముగ్గురూ ఉంటారని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని టీజర్ విడుదల చేసినప్పుడే చెప్పేసారు. ఈ సినిమాకి చిట్టూరి శ్రీనివాస్ (ChitturiSrinivas) నిర్మాత, కాగా బెజవాడ ప్రసన్న కుమార్ (BezawadaPrasannaKumar) కథ ఇచ్చారు. ఇందులో అల్లరి నరేష్ (AllariNaresh), రాజ్ తరుణ్ (RajTarun) కూడా ఉంటారని ఒక వార్త, కానీ ఇంకా అధికారికంగా మిగతా నటుల గురించి చెప్పలేదు.

ఇక మెగా స్టార్ చిరంజీవి 'బింబిసార' #Bimbisara దర్శకుడు వసిష్ఠ మల్లాది (VasishtaMalladi) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఒక ఫాంటసీ కథా నేపథ్యంలో ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ కథ కూడా ముగ్గురు కథానాయికలను డిమాండ్ చేస్తుంది అని, అందుకే ముగ్గురు వుంటారు ఒక వార్త. అయితే ఈ ముగ్గురిలో ఐశ్వర్య రాయి (AishwaryaRai), మృణాల్ ఠాకూర్ (MrunalThakur) ల పేర్లు వినపడుతున్నాయి. ఇక మూడో పేరు ఈమధ్యనే 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' #MissShettyMrPolishetty తో విజయం సాధించిన అనుష్క శెట్టి (AnushkaShetty) పేరు వినపడుతోంది.

chiranjeevi-new2.jpg

ఇప్పుడు అందరి దృష్టి ఈ సీనియర్ నటుల సినిమాల మీదే వున్నాయి. ఎందుకంటే చిరంజీవి ఫాంటసీ సినిమా చేసి చాలా సంవత్సరాలు అయింది, ఇప్ప్పుడు మళ్ళీ అలాంటి నేపధ్యం వున్న సినిమాని ఎంచుకున్నారు. అలాగే నాగార్జున కూడా ఒక మాస్ అవతార్ లో కనిపించనున్నారు, దర్శకుడు కూడా కొత్తవాడు అవటం, ఈ రెండు సినిమాలు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి.

Updated Date - 2023-09-19T11:26:23+05:30 IST