Salaar: ప్రభాస్ మీద వస్తున్న ఈ వార్త నిజమేనా....

ABN , First Publish Date - 2023-12-14T13:07:03+05:30 IST

ప్రభాస్ నటించిన 'సలార్' మొదటి పార్టు ఈనెల 22న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇంతవరకు ఈ సినిమా ప్రచారాలు ఏమీ ప్రారంభించలేదు. అయితే ఈ సినిమాకి ప్రభాస్ పారితోషికం ఎంత అనే విషయంలో పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.

Salaar: ప్రభాస్ మీద వస్తున్న ఈ వార్త నిజమేనా....
Prabhas and Prithviraj Sukumaran from Salaar

ప్రభాస్ (Prabhas) నటించిన 'సలార్' #Slaar:Part1Ceasefire సినిమా ఈనెల 22న విడుదలకి సిద్ధం అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకుడు (Prashanth Neel), హోంబలే ఫిలిమ్స్ (HombaleFilms) నిర్మిస్తోంది. వీళ్ళు ఇంతకు ముందు 'కెజిఎఫ్' #KGF రెండు పార్టులు నిర్మించారు. ఈ 'సలార్' సినిమాని జనవరి 2021లో అధికారికంగా ప్రారంభించారు, అదే నెల ఆఖరి వారం నుండి షూటింగ్ మొదలెట్టారు. ఈ సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చి ఈ డిసెంబర్ 22న ఎట్టకేలకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా మొదట్లో ఒక పార్టు అనుకున్నారు, కానీ తరువాత దీన్ని రెండు పార్టులుగా చేశారు. మొదట 'సలార్: సీజ్ ఫైర్' విడుదలవుతోంది. ఇందులో మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

prashanthneelprabhas.jpg

శృతి హాసన్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, శ్రీయా రెడ్డి ఇంకో ముఖ్య పాత్రలో కనపడనున్నారు. జగపతి బాబు, బాబీ సింహ, టిను ఆనంద్, ఈశ్వరి రావుతో పాటు ఇంకా చాలామంది నటీనటులు వున్నారు. అయితే ఈ సినిమాకి ప్రభాస్ కి ఇచ్చిన పారితోషికం మీద ఇప్పుడు పరిశ్రమలో ఒక టాపిక్ గా మారిందని అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్కి అనుకున్నంతగా ఈ సినిమాకి పారితోషికం ఇవ్వలేదని అంటున్నారు. ప్రభాస్ ప్రతి సినిమాకి సుమారు రూ. 100 కోట్లు పైనే తీసుకుంటున్నారని వినికిడి. 'బాహుబలి' తరువాత అతని సినిమాలు అన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవడం, బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఓపెనింగ్స్ రావటం వలన ప్రభాస్ కి పారితోషికం ఎక్కువ డిమాండ్ చెయ్యడంలో తప్పులేదు అని కూడా అంటున్నారు. అయితే ఈ 'సలార్' మూవీ కి మాత్రం అంత పారితోషికం ఇవ్వలేదని, నూరు కోట్లు కన్నా చాలా తక్కువ ఇచ్చారని ఒక వార్త నడుస్తోంది.

అదీ కాకుండా ఈ సినిమా రెండు పార్టులుగా వస్తూ ఉండటంతో ఇంకా ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సి వస్తుందని, అందువలన రెండు పార్టులు ఒకేసారి దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి చేసేశారని కూడా అంటున్నారు. ప్రభాస్ పాత్ర ఎక్కువగా కనిపించేది రెండో పార్టులో అని కూడా వార్తలు వస్తున్నాయి. మొదటి పార్టులో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ (PrithvirajSukumaran) చిన్నప్పుడు పాత్రలు ఎక్కువ కనిపిస్తాయని కూడా ఒక టాక్ నడుస్తోంది. అందువలనే ప్రభాస్ కూడా ఈ సినిమా ప్రచారాలకు కొంచెం దూరంగా వున్నారని కూడా పరిశ్రమలో అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మీద వస్తున్న వార్తలన్నిటికీ ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-12-14T13:07:04+05:30 IST