NBK108: రాజేంద్ర ప్రసాద్ లేకుండా అనిల్ రావిపూడి సినిమా, ఇది బ్రేకింగ్ న్యూస్ అంట

ABN , First Publish Date - 2023-04-23T15:32:41+05:30 IST

అనిల్ రావిపూడి దర్శకత్వం చేస్తున్న ఏ సినిమాలో అయినా రాజేంద్ర ప్రసాద్ ఉండాల్సిందే. అయితే మరి ఇప్పుడు అతను నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు, కానీ ఇందులో కూడా రాజేంద్ర ప్రసాద్ ఉండాలి, కానీ చివరి నిముషాల్లో ఏమైంది అంటే...

NBK108: రాజేంద్ర ప్రసాద్ లేకుండా అనిల్ రావిపూడి సినిమా, ఇది బ్రేకింగ్ న్యూస్ అంట

దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇప్పుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) కథానాయికగా నటిస్తుండగా, మరొక నటి శ్రీలీల (Sreeleela) కూడా ఇందులో వుంది. అయితే శ్రీలీల, బాలకృష్ణ కూతురుగా వేస్తోంది అని బయట టాక్ నడుస్తోంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, అనిల్ రావిపూడి సినిమాలు ఒక్కసారి చూస్తే కనక, ఇంచుమించు అతని అన్ని సినిమాల్లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఒక ప్రత్యేక పాత్రలో కనపడతాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రలుగా వచ్చిన 'గాలి సంపత్' (Gali Sampath) సినిమాకి స్క్రీన్ ప్లే కూడా ఇచ్చాడు అనిల్ రావిపూడి. వాళ్ళిద్దరి మధ్య అంతటి అనుబంధం వుంది. అనిల్ రావిపూడి తీసిన చివరి అయిదు సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్య పాత్రలో కనపడతాడు.

nbk-political3.jpg

అయితే ఇప్పుడు తాజా వార్త ఏంటి అంటే, అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ఈ #NBK108 సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లేడు అని తెలిసింది. అయితే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని అంటున్నారు. ఎందుకంటే ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ని తీసుకోవాలని సంప్రదించారు అని పరిశ్రమలో టాక్. అలాగే షూటింగ్ కి సిద్ధం అయ్యారు అని కూడా తెలిసింది. కానీ చివరి నిముషం లో రాజేంద్ర ప్రసాద్ కి బదులు వేరే నటుడిని ఆ పాత్రకి ఎంపిక చేసుకున్నారు అని కూడా అంటున్నారు. ఇలా జరగడానికి కారణం బాలకృష్ణ అని ఆ సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు.

rajendraprasad.jpg

నందమూరి బాలకృష్ణ దర్శకుడుకి రాజేంద్ర ప్రసాద్ కి బదులు ఇంకో నటుడిని పెట్టుకోమని సలహా ఇచ్చాడు అని యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ ని ఎందుకు వద్దన్నాడు, ఎందుకు రాజేంద్ర ప్రసాద్ కి బదులు ఆ వేరే నటుడిని పెట్టుకున్నారో ఇంకా వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Updated Date - 2023-04-23T15:32:41+05:30 IST