సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

PKSDT: టైటిల్ ఫిక్సయిందా.. ‘దేవుడే దిగివచ్చినా’ కాదా?

ABN, First Publish Date - 2023-05-09T13:53:15+05:30

‘PKSDT’ టైటిల్ ఇదేనంటూ ఓ టైటిల్ బాగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ చిత్రానికి ఇంతకుముందు కూడా చాలా టైటిల్స్ వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఇందులో పవన్ కల్యాణ్ దేవుడి పాత్ర చేస్తుండటంతో..

Pawan Kalyan and Sai Dharam Tej in PKSDT Sets
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ‘PKSDT’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘PKSDT’ టైటిల్ ఇదేనంటూ ఓ టైటిల్ బాగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ చిత్రానికి ఇంతకుముందు కూడా చాలా టైటిల్స్ వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఇందులో పవన్ కల్యాణ్ దేవుడి పాత్ర చేస్తుండటంతో.. ‘దేవుడే దిగివచ్చినా’ (Devude Digivachhina) అనే టైటిల్ దాదాపు కన్‌ఫర్మ్ అయినట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడా టైటిల్ ప్లేస్‌లో మరో టైటిల్ వచ్చి చేరింది. దాదాపు ఇదే టైటిల్ కన్‌ఫర్మ్ అనేలా ప్రస్తుతానికైతే టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటంటే..

‘PKSDT’ చిత్రానికి ‘బ్రో’ (Bro) అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారట. ఇది తమిళంలో తెరకెక్కి మంచి విజయం సాధించిన ‘వినోదయ్య సిత్తం’ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఆ సినిమాని తెరకెక్కించిన టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని (Samuthirakani)నే ఈ చిత్రానికి (PKSDT) కూడా దర్శకుడు. తమిళ్‌లో దేవుడి పాత్రలో స్వయంగా సముద్రఖనినే నటించారు. ఈ రీమేక్‌లో మాత్రం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆ పాత్రను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి టాకీపార్ట్ మొత్తం పూర్తయినట్లుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఇంకా ఓ పాట చిత్రీకరించాలని అంటున్నారు.

ఈ పాట చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ భారీ సెట్‌ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ పాట పబ్‌లో చిత్రీకరించాల్సి ఉండటంతో.. గ్రాండ్‌గా పబ్ సెట్‌ వేశారని.. త్వరలోనే పాటను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘ఓజీ’ షూట్‌లో ఉన్నారు. మరోవైపు సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ ఇతర భాషలలో రిలీజ్ విడుదల సందర్భంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ ఫ్రీ అవ్వగానే ఈ సాంగ్ చిత్రీకరణ జరపనున్నారని తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory), జీ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేయనున్నామని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ చిత్ర టైటిల్‌ను కూడా అతి త్వరలో మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Tamanna: పొంగల్‌కి శృతిహాసన్.. ఇండిపెండెన్స్ డేకి తమన్నా..

*The Kerala Story: మరో స్టేట్‌లో నిషేధం.. షాక్‌లో చిత్రయూనిట్

*Shah Rukh Khan: అద్భుతాలు జరగడానికి సమయం పడుతుంది.. వెయిట్ అండ్ సీ..

*OG: చాలా గ్యాప్ తర్వాత.. పవన్ కల్యాణ్‌ నుంచి ఊహించని ట్వీట్

*Balagam: ఉత్త‌మ న‌టుడు సాయిలు, ఉత్త‌మ స‌హన‌టుడు కొమురయ్య.. మరో ప్రతిష్టాత్మక అవార్డ్

*Bhookailas: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఉదయం 5 గంటలకు షూటింగ్ అని చెప్పిన దర్శకుడు రాకపోవడంతో..?

Updated Date - 2023-05-09T13:53:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!