Meera Jasmine: ఈ వయసులో కూడా తగ్గని అందాలు, కథానాయకురాలిగా రెడీ

ABN , First Publish Date - 2023-08-16T12:14:33+05:30 IST

మీరా జాస్మిన్ తెలుసు కదా, అప్పుడెప్పుడో రవి తేజతో 'భద్ర' సినిమాలో చేసింది, ఆ తరువాత పవన్ కళ్యాణ్ పక్కన 'గుడుంబా శంకర్' సినిమాలో కూడా నటించింది. ఆమె మళ్ళీ ఇప్పుడు తెలుగులో కథానాయకురాలిగా వస్తోంది, ఎవరితో అంటే...

Meera Jasmine: ఈ వయసులో కూడా తగ్గని అందాలు, కథానాయకురాలిగా రెడీ
Meera Jasmine

మీరా జాస్మిన్ (MeeraJasmine) దక్షిణాదిలో సినిమా ప్రేక్షకులకి పరిచయం అయిన నటి. ఎందుకంటే దక్షిణాదిలో వున్న నాలుగు భాషల్లోనూ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలలో ఒక వెలుగు వెలిగిన నటి మీరా జాస్మిన్. స్వతహాగా మలయాళీ అయినా, అన్ని భాషల్లోనూ చాలా సినిమాలు చేసి అవార్డులు కూడా చాలా గెలుచుకుంది మీరా జాస్మిన్. తెలుగులో రవితేజ (RaviTeja) పక్కన 'భద్ర', పవన్ కళ్యాణ్ (PawanKalyan) పక్కన 'గుడుంబా శంకర్' #GudumbaShankar సినిమాలోనూ నటించింది. అయితే ఈమధ్య సినిమాలకి కొంచెం దూరంగా ఉంటూ మళ్ళీ 'విమానం' #Vimanam సినిమా ద్వారా తెలుగులోకి వచ్చింది.

meerajasmine.jpg

సముద్రఖని (Samuthirakani), అనసూయ (AnasuyaBharadwaj), రాహుల్ రామకృష్ణ (RahulRamakrishna) నటించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఒక ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తుంది. కానీ ఈ సినిమా వ్యాపారాత్మకంగా అంత విజయం సాధించలేదు కాబట్టి, ఈ సినిమాలో మీరా జాస్మిన్ పాత్రని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మీరా తెలుగు సినిమాలలో మళ్ళీ రావాలని అనుకుంటోంది అన్న సంకేతం అయితే ఈ సినిమాతో ఇచ్చింది. అలాగే ఆమె తన సాంఘీక మాధ్యమాల్లో రెగ్యులర్ గా తన ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ నేను ఇంకా చాలా గ్లామర్ గానే వున్నాను అన్నట్టుగా కూడా చెప్పింది.

meerajasmine2.jpg

అందుకనే ఇప్పుడు మీరా జాస్మిన్ ఒక తెలుగు సినిమా చేస్తోంది అని అంటున్నారు. శ్రీవిష్ణు (SreeVishnu), రీతు వర్మ (RituVarma) జంటగా నటిస్తున్న 'స్వాగ్' #Swag అనే సినిమాలో మీరా జాస్మిన్ రెండో కథానాయకురాలిగా చేస్తున్నట్టుగా తెలిసింది. 40 దాటిన మీరా జాస్మిన్ తాను కథానాయకురాలిగా చెయ్యగలను అని ఈ సినిమాలో నటించడం చాలామందికి స్ఫూర్తి గా వుంటుందనే చెప్పాలి. ఎందుకంటే సినిమా ప్రపంచంలో మామూలుగా ఇలా రెండోసారి నాలుగు పదుల వయసు దాటినా నటీమణులు కథానాయకురాలిగా రావటం అరుదు. మరి మీరా జాస్మిన్ చేస్తోంది అంటే మెచ్చుకోదగ్గ విషయమే కదా!

Updated Date - 2023-08-16T12:14:33+05:30 IST