సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

SSMB28: అసలు ఏమి జరుగుతోంది? వెకేషన్ నుండి మహేష్ రాలేదు, కుటుంబం మాత్రం వచ్చేసారు

ABN, First Publish Date - 2023-05-04T15:15:07+05:30

మహేష్ వెకేషన్ నుండి రాకుండా, అతని కుటుంబం మాత్రం హైదరాబాద్ చేరుకున్నారు అంటే అతను త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ ఇప్పట్లో జరగదనా? అసలు ఏమి జరుగుతోంది అని అభిమానులు ఆందోళనలో వున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న #SSMB28 సినిమా గురించి ఇంకా అనిశ్చితి నెలకొంది. మహేష్ కుటుంబం అంతా వెకేషన్ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చేసారు, కానీ మహేష్ ఇంకా రాలేదు అని తెలిసింది. అతని భార్య నమ్రత (NamrataShirodkar), కూతురు సితార (SitaraGhattamaneni), కొడుకు గౌతమ్, ఎయిర్ పోర్టు లో అందరికి కనిపించారు, ఫోటోస్ కూడా తీసుకున్నారు, కానీ మహేష్ మాత్రం రాలేదు, ఇంకా వెకేషన్ లో వున్నాడని తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏమైంది, ఎందుకు ఈ సినిమా షూటింగ్ చెయ్యకుండా మహేష్ వెకేషన్ అంటూ తిరుగుతున్నాడు. బౌండ్ స్క్రిప్ట్ తోటే వచ్చాడా త్రివిక్రమ్ శ్రీనివాస్, లేదా మహేష్ కి మధ్యలో కథ ఏమైనా నచ్చలేదా? ఎందుకు ఇంత డిలే అని అభిమానులు ఆందోళనలో వున్నారు.

నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) ట్వీట్ చేసాడు, సినిమా అనుకున్నట్టుగానే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల అవుతుందని, అలాగే మే 31, కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ కూడా ఉంటుందని. మరి షూటింగ్ అవటం లేదు కదా, అప్డేట్ ఏమిస్తాడో చూడాలి. ఎందుకంటే ఆరోజు ఒక టీజర్ లాంటిది వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు, అది కాకుండా వూరికే ఎదో సినిమా గురించి అప్డేట్ అంటే, మళ్ళీ అభిమానులు నిరాశకు గురయ్యే అవకాశం వుంది.

అసలు ఈ సినిమా మొదలయిన దగ్గర నుంచే వార్తల్లో వుంది. ఫస్ట్ షెడ్యూల్ అవుతూ ఉండగానే, మహేష్ కి యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కి పడలేదని ఒకటి, అందుకే ఆ షెడ్యూల్ కూడా రెండు రోజులు ముందుగానే ముగించారు అని అప్పట్లో టాక్ నడిచింది. ఆ తరువాత షూటింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు, మహేష్ తల్లి ఇందిరాదేవి (Indiradevi) పోయారు. తరువాత షూటింగ్ ఎందుకో అవలేదు, ఆలా పోస్టుపోన్ అవుతూ వస్తోంది. తరువాత మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (SuperStar Krishna) గారు పోయారు, మళ్ళీ షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ పోస్టుపోన్ అయింది. ఎందుకు అయిందో ఎవరికీ తెలియదు. కానీ ఎదో జరుగుతోంది అని మాత్రం అర్థం అవుతోంది అని ఒక టాక్ నడుస్తోంది. అందుకే మహేష్ ఇంకా వెకేషన్ లో ఉండటం, కుటుంబం మాత్రం వెనక్కి రావటం జరిగింది అని అంటున్నారు.

Updated Date - 2023-05-04T15:15:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!