SSMB28: మళ్ళీ అయోమయంలో పడిన మహేష్, త్రివిక్రమ్ సినిమా

ABN , First Publish Date - 2023-04-29T14:40:07+05:30 IST

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా #SSMB28 గురించి నిర్మాత అధికార ప్రకటన ఇచ్చిన మరునాడే మహేష్ బాబు తన కుటుంబంతో వెకేషన్ వెళ్ళటం అభిమానుల్లో ఆందోళన ఎక్కువయింది అని అంటున్నారు

SSMB28: మళ్ళీ అయోమయంలో పడిన మహేష్, త్రివిక్రమ్ సినిమా
Mahesh Babu and Namrata

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న సినిమా #SSMB28 మీద రూమర్స్ ఇంకా సమసిపోలేదు. మొన్న అధికారికంగా ఆ సినిమా నిర్మాత నాగ వంశీ (NagaVamsi) ప్రకటన ఇచ్చాడు, సినిమా గురించి వస్తున్న వార్తలన్నీ అబద్ధం, సినిమా అప్డేట్ మే 31 న ఉంటుంది, అలాగే సినిమా కూడా జనవరి 2024లో విడుదల అని. ఈ ప్రకటన ఇచ్చిన మరునాడే మహేష్ బాబు, అతని కుటుంబ సభ్యులు అందరితో వెకేషన్ కి వెళ్ళిపోయాడు.

maheshbabuvacation1.jpg

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మహేష్ బాబు, అతని భార్య నమ్రత శిరోద్కర్ (NamrataShirodkar), కూతురు సితార (Sitara), కొడుకు గౌతమ్ (GautamGhattamaneni) తో చాలా సంతోషంగా వెకేషన్ కి వెళ్ళాడు. కొన్ని రోజుల క్రితమే వెకేషన్ నుండి వచ్చిన మహేష్ బాబు, తన సినిమా షూటింగ్ చెయ్యకుండా, ఇంకో వెకేషన్ కి వెళ్లడం, అదీ నిర్మాత ప్రకటన ఇచ్చిన మరునాడే, అభిమానులకు ఆందోళనకు గురిచేస్తోంది.

అసలు ఈ సినిమా ఉంటుందా, ఉండదా, లేక నిర్మాత వూరికే ఆలా ప్రకటనలు ఇస్తున్నాడా, ఏమి క్లారిటీ రావటం లేకపోవటంతో మహేష్ అభిమానులు కొంచెం ఆందోళనలో వున్న మాట వాస్తవం. ఎందుకంటే ఇంకో ఒకటి రెండు నెలల్లో లేదా ఆగస్టులో రాజమౌళి (Rajamouli) సినిమా కనక #SSMB29 అధికారికంగా లాంచ్ చేసే అవకాశం వుంది. ఒకవేళ అది అధికారికంగా మొదలెడితే ఇంకా దాని మీదకి మహేష్ బాబు దృష్టి ఎక్కువ ఉంటుంది అని, అప్పుడు త్రివిక్రమ్ సినిమా ఇంకా లేట్ అయ్యే ప్రమాదం వుంది అని కూడా అంటున్నారు.

maheshbabuvacation2.jpg

ఇంతకీ ఎందుకు ఈ సినిమా షూటింగ్ అవటం లేదు, అంతా సవ్యంగానే ఉందా? లేక నిర్మాత, దర్శకుడు, మహేష్ బాబు ల మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చాయా అని ఇటు పరిశ్రమలో, అటు అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-04-29T14:40:07+05:30 IST