Prabhas: అతని సినిమాలు అన్నీ అంతే, విడుదలలో జాప్యం

ABN , First Publish Date - 2023-09-13T13:46:50+05:30 IST

ప్రభాస్ 'సాలార్' సినిమా విడుదల మళ్ళీ వాయిదా పడింది. అయితే ఇలా సినిమాలు విడుదలలో వాయిదాలు పడటం ప్రభాస్ కి అలవాటే అని, అతని అభిమానులు కూడా దానికి అలవాటు పడిపోయారని పరిశ్రమలో టాక్. గత పదేళ్లలో ప్రభాస్ సినిమాలు అన్నీ చూస్తే...

Prabhas: అతని సినిమాలు అన్నీ అంతే, విడుదలలో జాప్యం
Prabhas

ప్రభాస్ (Prabhas) నటించిన తాజా సినిమా 'సాలార్' #Salaar ఈనెల 28న విడుదల కావాల్సి వుంది, కానీ ఇప్పుడు అది వాయిదా పడింది. ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం నిర్మాతలు మళ్ళీ చెపుతామని ప్రకటించారు. దీనికి ప్రశాంత్ నీల్ (PrashanthNeel) దర్శకుడు కాగా, హోంబలే ఫిలిమ్స్ (HombaleFilms) నిర్మాతలు. ఈ సినిమాలో శృతి హాసన్ (ShrutiHaasan) కథానాయిక కాగా మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (PrithvirajSukumaran) ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ప్రభాస్ అభిమానులు కొంచెం నిరాశ పడినా, ఇది మాకు మామూలే అన్నట్టుగా వున్నారని తెలిసింది. ఎందుకంటే ఇదొక్కటే కాదు, ఇంతకు విడుదలైన ప్రభాస్ సినిమాలు చాలా ఇలానే ఒక తేదీ ముందు ప్రకటించి ఆ తరువాత ఇంకో తేదీకి విడుదల చేశారు. ఎప్పుడూ అనుకున్న తేదీకి విడుదల చేయలేకపోయారు. #SalaarReleaseDate

prabhas-new2.jpg

ఎస్ఎస్ రాజమౌళి (SSRajamouli) దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 1' #Baahubali 2014 లో విడుదలకావాల్సి ఉండగా, 2015లో విడుదలైంది. అలాగే ఆ సినిమాకి రెండో పార్టు 'బాహుబలి 2' కూడా 2016లో విడుదల అని ప్రకటించారు, కానీ పోస్టుపోన్ అయి 2017 సంవత్సరంలో విడుదలైంది. ఆ తరువాత వచ్చిన 'సాహో' #Saaho కూడా ముందు అనుకున్నట్టుగా 2018లో విడుదల చెయ్యాలి, కానీ 2019లో విడుదల చేశారు. తరువాత వచ్చిన 'రాధేశ్యామ్' సినిమా కూడా ఇలానే రెండు సార్లు పోస్టుపోన్ చేశారు. ఈ సినిమా అయితే 2020 లో విడుదలవ్వాలి, కానీ 2021 లో కూడా కాలేదు, అలాగే 2022 లో అయింది. ఫ్లాపు అయింది.

ఈమధ్యనే వచ్చిన 'ఆదిపురుష్' #Adipurush సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ముందుగా 2021 లో విడుదల అన్నారు, తరువాత 2022 లో విడుదలని అన్నారు, కానీ ఈ సినిమా టీజర్ గురించి చాలా విమర్శలు రావటంతో, ఈ సినిమా విడుదల కూడా పోస్టుపోన్ చేసుకుంటూ వచ్చి ఈసంవత్సరం విడుదల చేశారు. ఇప్పుడు 'సాలార్' పరిస్థితి కూడా అంతే! 2022 సంవత్సరం నుండి ఈ ఇయర్ అన్నారు, ఇప్పుడు అది కూడా లేనట్టుగా వుంది. వచ్చే సంవత్సరానికి వాయిదా పడొచ్చు అని అంటున్నారు.

ఇక తరువాత రాబోతున్న 'కల్కి 2898 ఎడి' #Kalki2898AD సినిమా కూడా ఈ సంవత్సరం అన్నారు, కానీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి అంటున్నారు, కానీ అప్పటికి కూడా విడుదలయ్యేలా లేదు. అది కూడా మళ్ళీ పోస్టుపోన్ చేసే అవకాశాలు వున్నాయి. ఇలా ప్రతి ప్రభాస్ సినిమా ఇలా పోస్టుపోన్ చేసుకుంటూ వస్తున్నారు, అయితే ఇవన్నీ చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియన్ సినిమాలు, అలాగే ఈ సినిమాలలో గ్రాఫిక్స్ చాలా ప్రాముఖ్యం వహించాయి.

Updated Date - 2023-09-13T13:46:50+05:30 IST