UstadBhagathSingh: దర్శకుడు హరీష్ శంకర్ వేరే సినిమా చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా ?

ABN , First Publish Date - 2023-07-17T11:21:01+05:30 IST

పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్న హరీష్ శంకర్, ఆ సినిమా ఎన్నికలయ్యే వరకు అవదు అనుకుంటున్నా నేపథ్యంలో, రవి తేజ తో వేరే సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమా కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుందని భోగట్టా...

UstadBhagathSingh: దర్శకుడు హరీష్ శంకర్ వేరే సినిమా చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా ?
Pawan Kalyan as Ustaad Bhagath Singh

దర్శకుడు హరీష్ శంకర్ (HarishShankar), పవన్ కళ్యాణ్ (PawanKalyan) తో 'ఉస్తాద్ భగత్ సింగ్' #UstadBhagathSingh సినిమా చేస్తున్నారు, అయితే ఇది షూటింగ్ ఇంకా మొదటి దశలోనే వుంది. అంటే పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో చాలా బిజీ అయ్యారు, కొంచెం వెసులుబాటు కాగానే సినిమా షూటింగ్స్ కి డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి చేయాల్సినవి. 'బ్రో' #Bro షూటింగ్ పూర్తయింది, విడుదలకి సిద్ధంగా వుంది. దీనికి సముద్రఖని (Samuthirakani) దర్శకుడు. తరువాత 'ఓజీ' (OG) సినిమా కూడా చాలావరకు పూర్తయింది అని అంటున్నారు, పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు పని చేస్తే చాలు అంటున్నారు.

అయితే రెండు సినిమాలు మాత్రం బాగా డిలే అయిపోయాయి, ఒకటి క్రిష్ (Krish) దర్శకత్వంలో వస్తున్న 'హరిహర వీరమల్లు' #HariHaraVeeramallu, రెండోది హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' #UstadBhagathSingh. 'హరిహర వీరమల్లు' కూడా చాలామట్టుకు అయింది అంటున్నారు, దానికి పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో కొన్ని రోజులు వస్తే చాలంటున్నారు. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' కి మాత్రం పవన్ కళ్యాణ్ చాలా రోజులు రావాల్సి వుంది.

harishshankar1.jpg

అందుకే దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా చెయ్యడానికి చాలా కాలం పడుతుంది, దానికి తోడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా చాలా బిజీ అయిపోయారు, ఎన్నికలు త్వరలోనే వచ్చేస్తున్నాయి, అందుకని హరీష్ శంకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. హరీష్ శంకర్ ఇప్పుడు రవితేజ (RaviTeja) తో ఒక సినిమా ప్లాన్ చేసాడని తెల్సింది. పీపుల్స్ మీడియా ఫేక్టరీ (PeoplesMediaFactory) ఈ హరీష్-రవితేజ సినిమాని నిర్మిస్తున్నారని తెలిసింది. అంటే పవన్ కళ్యాణ్ సినిమా మీద పూర్తిగా ఆశలు వదులుకున్నట్టే అని ఒక టాక్ పరిశ్రమలో నడుస్తోంది.

harishshankar2.jpg

హరీష్ శంకర్ దర్శకుడిగా ఒక పూర్తి సినిమా చేసింది 'గద్దలకొండ గణేష్' #GaddalakondaGanesh, ఇది 2019 లో విడుదల అయింది. ఆ సినిమా తరువాత నుండి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడు అని, స్క్రిప్ట్ వర్క్, చివరికి పట్టాలెక్కేసరికి ఇన్ని సంవత్సరాలు అయింది. కొన్ని రోజులు సినిమా షూటింగ్ చేసాక, ఇప్పుడు పవన్ బిజీ అయిపోయారు. ఇక ఈ సినిమా ఎన్నికల ముందు అవదు అందరికీ తెలిసిపోయింది, అందుకే హరీష్ వేరే సినిమా తో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది.

Updated Date - 2023-07-17T11:21:01+05:30 IST