Dhamaka: ఓటీటీలోకీ వచ్చేస్తున్న ధమకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-01-11T16:53:49+05:30 IST

మాస్ మహారాజా రవితేజ (Raviteja) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘ధమాకా’ (Dhamaka). కమర్షి యల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ లాభాలను పంచిపెట్టింది.

Dhamaka: ఓటీటీలోకీ వచ్చేస్తున్న ధమకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

మాస్ మహారాజా రవితేజ (Raviteja) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘ధమాకా’ (Dhamaka). కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ లాభాలను పంచిపెట్టింది. ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అందరి ఎదురు చూపులకు త్వరలోనే తెరపడనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.

‘ధమాకా’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ రైట్స్ కోసం భారీ ధరను చెల్లించిందని తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం అందుతుంది. చిత్రబృందం అందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేయనుందట. ధమాకాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 23న విడుదలైంది. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్‌గా నటించింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. బెజవాడ ప్రసన్నకుమార్ రచయితగా వ్యవహరించాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు.

Updated Date - 2023-01-11T16:55:35+05:30 IST