కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandra Mohan and NTR: రామారావుగారితో సినిమాలు అందుకే చెయ్యలేదా!

ABN, First Publish Date - 2023-11-11T16:50:08+05:30

సీనియర్ నటుడు చంద్రమోహన్ అందరి నటుల కాంబినేషన్ లో చాలా సినిమాలు చేశారు, కానీ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మాత్రం చాలా తక్కువ సినిమాలు చేశారు, ఎందుకు అలా చేశారంటే కారణం ఇదే అంటున్నారు.

Chandra Mohan and NT Rama Rao

చంద్రమోహన్ (Chandra Mohan) సుమారు 900కి పైగా సినిమాలలో నటించారు. అందులో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ నటుడుగా, మల్టీ స్టారర్ సినిమాలు ఇలా ఎన్నో వున్నాయి. పరిశ్రమలో సుమారు అందరి నటులతో నటించిన ఏకైక నటుడు చంద్ర మోహన్ తప్ప మరెవరూ లేరు. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna), రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju), అందాల నటుడు శోభన్ బాబు (Sobhan Babu), చంద్రమోహన్ ఈ నలుగురూ ఇంచుమించు కొన్ని నెలల తేడాలో పరిశ్రమలోకి అడుగు పెట్టారు, అలాగే ఈ నలుగురూ మంచి స్నేహితులు కూడా. (Chandra Mohan passed away)

అందులోకి చంద్రమోహన్, కృష్ణ, కృష్ణంరాజు ఈ ముగ్గురూ ఎప్పుడూ ఒకరితో ఒకరు టచ్ లో ఉండేవారు. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, మురళి మోహన్ (Murali Mohan), చిరంజీవి (Chiranjeevi), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఇలా అందరితో మల్టీ స్టార్రర్ సినిమాలు చేసిన వ్యక్తి చంద్రమోహన్. అయితే చంద్ర మోహన్ చాలా తక్కువ సినిమాలు ఎన్.టి. రామారావుతో చేశారు. చంద్రమోహన్ చేసిన 900కి పైగా సినిమాలలో రామారావు గారితో చేసిన సినిమాలు చాలా తక్కువ. (Senior Tollywood actor Chandra Mohan is no more)

చంద్రమోహన్, ఎందుకు ఎన్.టి. రామారావుతో (NT Rama Rao) సినిమాలు ఎక్కువ చెయ్యలేదు అనే విషయం మీద పరిశ్రమలో అప్పట్లో ఒక వార్త నడిచింది అని చెప్తారు. హిందీ సినిమా 'యాదోంకి భారత్' #YaadonKiBaaraat అప్పట్లో ఒక పెద్ద హిట్ అయింది. 1973లో విడుదలైన ఈ సినిమాలో ధర్మేంద్ర (Dharemdnra), విజయ్ అరోరా, తారిఖ్ అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమా హిందీలో మొదటి వ్యాపారాత్మక, మసాలా చిత్రంగా చెపుతారు. ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేసి 'నాళై నామధే' (NaalaiNamadhe) అనే పేరు మీద తీశారు. అప్పటి తమిళ సూపర్ స్టార్ ఎం.జి. రామచంద్రన్ (MGRamachandran) ఇందులో ప్రధాన పాత్ర పోషించగా, చంద్రమోహన్ అతని తమ్ముడిగా నటించారు. నంబియార్ ఇంకో తమ్ముడిగా నటించారు.

ఇదే సినిమాని తెలుగులో కూడా 'అన్నదమ్ముల అనుబంధం' అనే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో ఎన్.టి. రామారావు ప్రధాన పాత్రలో, మురళి మోహన్, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ (NandamuriBalakrishna) అన్నదమ్ములుగా నటించారు. అయితే ఈ సినిమాలో తమిళంలో చేసిన చంద్రమోహన్ ని తీసుకోవాలని ముందు అనుకున్నారని, కానీ ఎన్టీఆర్ చంద్రమోహన్ కాదని, తన కుమారుడు బాలకృష్ణని అందులో నటింప చేశారని వార్త. తమిళం, తెలుగు ఈ రెండు రీమేక్ సినిమాలు ఒకేరోజు జులై 4, 1975 లో విడుదలయ్యాయి. అయితే అప్పటికే ఈ విషయం తెలిసి బాధపడిన చంద్రమోహన్ అప్పటి నుండి ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు చెయ్యలేదని అంటూ వుంటారు. ఈ కారణం వల్లనే చంద్రమోహన్, ఎన్.టి. రామారావు కాంబినేషన్ సినిమాలు ఎక్కువగా లేవు అని కూడా చెపుతూ వుంటారు.

చంద్రమోహన్ ఈరోజు ఉదయం 9 గంటల 45 నిముషాలకి హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. అతను వయస్సు 82 సంవత్సరాలు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు వున్నారు. చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని (Chandra Mohan funeral) కుటుంబ సభ్యులు చెపుతున్నారు.

Updated Date - 2023-11-11T18:24:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!