Agent: అఖిల్ పాన్ ఇండియా సినిమా థియేట్రీకల్ రైట్స్‌కు భారీ ధర

ABN , First Publish Date - 2023-02-24T13:36:12+05:30 IST

అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్‌’ (Agent). టాప్ డైరెక్టర్ సురేంద‌ర్‌ రెడ్డి (Surender Reddy) తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌గా రూపొందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మిస్తున్నారు.

Agent: అఖిల్ పాన్ ఇండియా సినిమా థియేట్రీకల్ రైట్స్‌కు భారీ ధర

అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్‌’ (Agent). టాప్ డైరెక్టర్ సురేంద‌ర్‌ రెడ్డి (Surender Reddy) తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌గా రూపొందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. ఈ మూవీ వేసవి కానుకగా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో షికార్లు కొడుతుంది. ‘ఏజెంట్’ చిత్రీకరణ పూర్తవ్వక ముందే ఈ మూవీ కర్ణాటక, తెలుగు రాష్ట్రాల థియేట్రీకల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయట.

‘ఏజెంట్’ కర్ణాటక, తెలుగు రాష్ట్రాల థియేట్రీకల్ రైట్స్‌ను అనిల్ సుంకర గంపగుత్తగా అమ్మేశారట. వైజాగ్‌కు చెందిన గాయత్రి ఫిలిమ్స్ ఈ రాష్ట్రాల హక్కులను రూ.34కోట్లు చెల్లించి కొనుగోలు చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. జీఎస్టీని మినహాయించి ఇంత భారీ ధరను చెల్లించడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ చిత్రంలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రను పోషిస్తున్నారు. సాక్షి వైద్య ఈ మూవీతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. హీరోయిన్‌గా కూడా ఆమెకు ఇదే మొదటి చిత్రం. ‘ఏజెంట్’ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు మేకర్స్ చెప్పారు. ‘ఏజెంట్’ నుంచి ఈ మధ్యనే ‘మళ్లీ మళ్లీ నువ్వే..’ అనే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో అఖిల్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అఖిల్ అక్కినేని కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) లో కనిపించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. బొమ్మరిల్లు బాస్కర్ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-24T16:39:46+05:30 IST