సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Agent: దర్శకుడు సురేందర్ రెడ్డి కి పెద్ద దెబ్బ, ట్వీట్ అఖిల్ ని సేవ్ చెయ్యడానికేనా !

ABN, First Publish Date - 2023-05-02T11:50:34+05:30

'ఏజెంట్' ఫెయిల్ అవ్వటం దర్శకుడు సురేందర్ రెడ్డి కి ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే 2016 లో 'ధ్రువ' తరువాత అతనికి పెద్ద బ్రేక్ అంటూ ఏమి లేదు. ఇదిలా ఉంటే అనిల్ సుంకర ఒత్తిడి ఉండటం వలనే ట్వీట్ చేసాడు అని కూడా టాక్ నడుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'ఏజెంట్' (Agent) సినిమా టోటల్ ఫెయిల్యూర్ అవ్వటం ఒక్క అఖిల్ (AkhilAkkineni), నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkar) కే కాదు, దర్శకుడు సురేందర్ రెడ్డి (Surender Reddy) కి కూడా పెద్ద దెబ్బ. ఎందుకంటే అతను పెద్ద హిట్ సినిమా ఇవ్వటానికి చాలా గ్యాప్ వచ్చేసింది. 2016 లో రామ్ చరణ్ (Ram Charan) తో 'ధ్రువ' (Dhruva) తీసాడు, అది పెద్ద హిట్ అయింది. ఆ సినిమా తమిళ సినిమా 'తని ఒరువన్' (Thani Oruvan) కి రీమేక్. తరువాత చిరంజీవి తో 'సైరా నరసింహారెడ్డి' (Syra Narasimha Reddy)తీసాడు, అది కూడా అనుకున్నంత పెద్ద విజయం సాధించలేదు అని అంటారు. ఆ సినిమా కూడా 2019 లో విడుదల అయింది. ఇప్పుడు అంటే 2023 లో అఖిల్ అక్కినేని తో 'ఏజెంట్' (Agent) చేసాడు, ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే విషయం లేదని తెలిసిపోయింది.

అంటే 2016 'ధ్రువ' తరువాత సురేందర్ రెడ్డి కి పెద్ద విజయం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు బ్రేక్ కావాలంటే ఒక మంచి స్క్రిప్ట్ తో ఒక పెద్ద స్టార్ తో సినిమా చెయ్యాలి. ఇప్పుడు 'ఏజెంట్' ఫెయిల్యూర్ అయింది, మరి వెంటనే ఎవరైనా ఒప్పుకుంటారా? చాలామంది అగ్రనటులు, వాళ్ళ తరువాత స్థానం లో వున్నవారు కూడా బిజీ గా సినిమాలు చేసుకుంటున్నారు. అంటే సురేందర్ రెడ్డి మరికొంత కాలం పాటు వేచి ఉండాల్సిందే, లేదా ఒక చిన్న సినిమా ఏదైనా తీసి మెప్పించాలి. అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప 2' (Pushpa 2) తో బిజీ, ప్రభాస్ (Prabhas) కి చాల టైం పడుతుంది, మహేష్ (Mahesh Babu) కూడా అంతే, ఎన్టీఆర్ (NTR) కూడా చాల సినిమాలు ఫిక్స్ అయ్యాయి, పవన్ కళ్యాణ్ కూడా బిజీ, చరణ్ లైన్ అప్ కూడా బిజీ, రవితేజ, బాలకృష్ణ (Balakrishna) ఇలా అందరూ లైన్ అప్ తో బిజీ గా వున్నారు. నితిన్, సాయి ధరమ్ తేజ్, గోపీచంద్, వరుణ్ తేజ్, నిఖిల్ లాంటి వాళ్ళు కూడా బిజీ గానే వున్నారు. మరి ఇప్పుడు అతను ఎవరితో ప్లాన్ చేస్తాడో, ఎలా చేస్తాడో చూడాలి అని ఒక టాక్ నడుస్తోంది.

నిర్మాత అనిల్ సుంకర, బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా షూటింగ్ కి వెళ్ళాము, అదే చాల పెద్ద తప్పు అని ట్వీట్ చేసాడు. మరి ఈ సినిమాకి రెండేళ్లు పట్టింది పూర్తి చెయ్యడానికి. అందులో దర్శకుడు సిక్ అవటం, వేరే ఇతరకారణాలు వున్నా, మరి ఎందుకు టీం స్క్రిప్ట్ మీద కూర్చోలేదు, పని చెయ్యలేదో వాళ్ళకే తెలియాలి. అదీ కాకుండా, అనిల్ సుంకర తప్పు ఒప్పుకున్న, అది కేవలం అఖిల్ అక్కినేని ని సేవ్ చెయ్యడం కోసం చేసిన ట్వీట్ లా వుంది. ఎందుకంటే అఖిల్ ని మొదటి రోజు నుండి సాంఘీక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు, అది తట్టుకోలేక అమల అక్కినేని కూడా ప్రతిస్పందించింది. ట్రోల్ ఎక్కువవడం తో వెంటనే అనిల్ సినిమా పోవటానికి కారణం మేమె అని ట్వీట్ చేసాడు అని కూడా ఒక టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-05-02T11:50:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!