Ravanasura: ప్రేమలోని పిచ్చిని చెప్పేందుకు వస్తోన్న మాస్ రాజా

ABN , First Publish Date - 2023-02-13T20:01:41+05:30 IST

వరుస విజయాలతో ఫుల్ స్వింగ్‌లో వున్న మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) ప్రేమలోని పిచ్చిని చెప్పేందుకు రెడీ అయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్..

Ravanasura: ప్రేమలోని పిచ్చిని చెప్పేందుకు వస్తోన్న మాస్ రాజా
Ravi Teja in Ravanasura

వరుస విజయాలతో ఫుల్ స్వింగ్‌లో వున్న మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) ప్రేమలోని పిచ్చిని చెప్పేందుకు రెడీ అయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో రవితేజ హీరోగా.. అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures), ఆర్ టి టీమ్‌వర్క్స్‌ (RT Team Works)పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ (Ravanasura). అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు. ఇప్పటికే ప్రమోషన్స్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్, అలాగే రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ సింగిల్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ చిత్రంలోని రెండవ సింగిల్ ‘ప్యార్ లోన పాగల్’ (Pyaar Lona Paagal) లిరికల్ వీడియోను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో షేడ్స్‌తో బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన రవితేజ.. అల్ట్రా-స్టైలిష్‌గా కనిపిస్తూ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్‌తో ఆకట్టుకుంటున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్‌ (Harshavardhan Rameswar)తో పాటు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో సుధీర్ వర్మ హై యాక్షన్‌‌లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథని అందించారు. తన మార్క్ టేకింగ్‌తో, కథనంలో ఊహించని మలుపులతో.. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా.. హీరో సుశాంత్ (Sushanth) కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 07 ఏప్రిల్ 2023న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Updated Date - 2023-02-13T20:01:43+05:30 IST