Radha Madhavam: వినాయక్ హీరోగా ‘రాధా మాధవం’.. ఫస్ట్ లుక్ విడుదల

ABN , First Publish Date - 2023-11-14T20:48:44+05:30 IST

విలేజ్ లవ్ డ్రామా నేపథ్యంలో వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరోహీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తుండగా.. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Radha Madhavam: వినాయక్ హీరోగా ‘రాధా మాధవం’.. ఫస్ట్ లుక్ విడుదల
Radha Madhavam 1st Look Launch

విలేజ్ లవ్ డ్రామా నేపథ్యంలో వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరోహీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’ (Radha Madhavam). దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తుండగా.. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ క్రమంలో మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ అనంతరం రాజ్ కందుకూరి (Raj Kandukuri) మాట్లాడుతూ.. ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. వినాయక్‌కు లీడ్‌గా ఇది రెండో చిత్రం. పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు. పోస్టర్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నానని అన్నారు. (Radha Madhavam First Look Out)

హీరో వినాయక్ (Hero Vinayak) మాట్లాడుతూ.. మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన నిర్మాత రాజ్ కందుకూరికి ధన్యవాదాలు. వారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలి. అందరూ మా సినిమాను చూడండని అంటే.. ‘టీమ్ ఎంతో సహకరించింది.. అడగగానే పోస్టర్ రిలీజ్ చేసిన రాజ్ కందుకూరిగారికి ధన్యవాదాలు’ అని అన్నారు చిత్ర నిర్మాత వెంకటేష్ (Gonal Venkatesh).


Radhaa-Madhavam.jpg

డైరెక్టర్ ఇస్సాకు (Dasari Eshaku) మాట్లాడుతూ.. ఓ మంచి ప్రేమ కథని ప్రేక్షకులకు చెప్పబోతున్నాం. పల్లెటూరి నేపథ్యంలో రాబోతోన్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఫస్ట్ లుక్ విడుదల చేసి మా టీమ్‌ని బ్లెస్ చేసిన నిర్మాత రాజ్ కందుకూరిగారికి థ్యాంక్స్. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని తెలిపారు. ఒక మంచి సినిమాకు పనిచేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు రైటర్ వసంత్ వెంకట్ బాలా (Vasanth Venkat Bala).


ఇవి కూడా చదవండి:

========================

*Roti Kapda Romance: యూత్‌ని ఆకర్షించేలా ‘రోటి కపడా రొమాన్స్’ ఫస్ట్ లుక్

*****************************

*Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. ‘దేవర’ నుండి క్రేజీ అప్‌డేట్!

*****************************

Updated Date - 2023-11-14T20:48:45+05:30 IST