Double iSmart: మరో 100 రోజుల్లో థియేటర్లలో రచ్చ రచ్చే..

ABN , First Publish Date - 2023-11-29T15:28:42+05:30 IST

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ప్రస్తుతం యూనిట్ అంతా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఏం లేదని తెలుపుతూ.. మరో 100 రోజుల్లో సినిమా విడుదల కానుందని మేకర్స్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో స్పష్టం చేశారు.

Double iSmart: మరో 100 రోజుల్లో థియేటర్లలో రచ్చ రచ్చే..
Ram Pothineni in Double ISmart

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannadh), ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart). ప్రస్తుతం యూనిట్ అంతా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ముంబైలో ప్రధాన తారాగణం‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి కొన్ని రూమర్స్ వినిపిస్తుండగా.. సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.

మొదట ప్రకటించినట్లుగానే ‘డబుల్ ఇస్మార్ట్‌’ 8 మార్చి, 2024న మహా శివరాత్రికి ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీని స్పష్టం చేయడానికి మేకర్స్ తాజాగా వందరోజుల కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో రామ్ పోతినేని ట్రెండీ హెయిర్‌డో, షేడ్స్ ధరించి సూపర్ స్టైలిష్ ఇంకా మ్యాసీవ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. షర్టు, జీన్స్‌తో జాకెట్ ధరించి, తుపాకీని పట్టుకొని టెర్రిఫిక్‌గా కనిపిస్తున్నారు. అతని వెనుక చాలా వెపన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో మాస్, యాక్షన్ వైబ్‌ ఏ రేంజ్‌లో ఉండబోతుందనేది ఈ పోస్టర్ సూచిస్తుంది. (Double iSmart Release Date)


Ram.jpg

ఇస్మార్ట్ శంకర్‌తో సహా పలు చిత్రాలలో పూరీ జగన్నాధ్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రామ్, పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*విలన్‌గా నటించాలనే కోరిక నెరవేరింది: యంగ్ హీరో

*************************************

*Shashtipoorthi: ‘లేడీస్ టైలర్’ జంట ‘షష్టిపూర్తి’ ఎంత వరకు వచ్చిందంటే..

***********************************

Updated Date - 2023-11-29T15:28:43+05:30 IST