సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hero Nikhil: మాదక ద్రవ్యాల రహిత తెలంగాణను చూడాలి!

ABN, First Publish Date - 2023-06-24T16:54:49+05:30

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనీ, వాటికి అలవాటు పడితే జీవితం అయిపోయినట్లేనని హీరో నిఖిల్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్రగ్స్‌కు(Drugs) దూరంగా ఉండాలనీ, వాటికి అలవాటు పడితే జీవితం అయిపోయినట్లేనని హీరో నిఖిల్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘నన్ను కూడా డ్రగ్స్‌ తీసుకోమని చాలామంది అడిగారు. నేనెప్పుడూ అటువైపు అడుగువేయలేదు. వాటికి దూరంగానే ఉన్నా. యువత ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో అందమైన జీవితం ఉంది. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. సరదాగా పార్టీలకు హాజరైనా డ్రగ్స్‌ జోలికి వెళ్లకండి. నార్కోటిక్స్‌ అలవాటు పడితే అదే డెత్‌ సెంటన్స్‌ అవుతుంది. సే నో టూ డ్రగ్స్‌. త్వరలోనే మాదక ద్రవ్యాలు రహిత తెలంగాణ అవ్వాలని (Say no to Drugs) కోరుకుంటున్నాను’’ అని అన్నారు. (Nikhil Spy movie)

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రియదర్శి మాట్లాడుతూ ‘‘డ్రగ్స్‌వల్ల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న అంశాలపై అందరికీ అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నార్కోటిక్స్‌ విభాగం చేయడం సంతోషంగా ఉంది. గతంలో సిగిరెట్‌ కాల్చేవాడిని. దానికి బానిస కాకూడదని భావించి మానేశాను. ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నాను’’ అని చెప్పారు.

Updated Date - 2023-06-24T16:54:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!