సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bholaa Shankar: సెలబ్రేషన్ సాంగ్ వచ్చేసింది.. కీర్తి, తమన్నాలతో చిరు స్టెప్పులు

ABN, First Publish Date - 2023-07-11T18:48:54+05:30

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమా నుంచి తాజాగా ‘జామ్ జామ్ జజ్జనక’ అనే పూర్తి లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో చిరంజీవితో పాటు తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ వంటి వారంతా సందడి చేశారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Bholaa Shankar Poster
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెహర్ రమేష్ (Meher Ramesh) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భోళా శంకర్’ (Bholaa Shankar). ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఒక పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో.. ఆ పాటకి సంబంధించిన ఓ వీడియోను ‘చిరు లీక్స్’ (Chiru Leaks) పేరుతో మెగాస్టార్ లీక్ చేశారు. ఆ పాట మేకింగ్‌లోని గ్రాండ్‌నెస్ చూసి లీక్ చేయాలని అనిపించినట్లుగా చిరు చెప్పుకొచ్చారు. ఆరోజు చిరు లీక్ చేసిన సాంగ్‌ ‘జామ్ జామ్ జజ్జనక’ (Jam Jam Jajjanaka) పూర్తి లిరికల్ సాంగ్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.


‘భోళా శంకర్’ గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్ అంటూ విడుదల చేసిన ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar) ఈ పాటని పార్టీ, సెలబ్రేషన్ వైబ్‌‌ను కలిగించేలా స్వరపరిచారు. అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), మంగ్లీ (Mangli) ఆలపించారు. కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) మాస్‌ని ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. మధ్యలో పాపులర్ ఫోక్ నెంబర్ నర్సపల్లెని మిక్స్ చేయడంతో పార్టీ వైబ్ మరొక రేంజ్‌కి వెళ్ళిపోయింది.

ఇక చిరంజీవి డాన్స్ మూమెంట్స్ మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. ఈ పాటలో మెగాస్టార్ యమా యాక్టివ్‌గా కనిపించారు. మధ్యలో పాట మేకింగ్‌ని కూడా చూపించారు. ఈ మేకింగ్‌లో యూనిట్‌తో చిరు సరదాగా కలిసిపోవడం, ముచ్చట్లు చెప్పడం గమనించవచ్చు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో చిరంజీవితో పాటు తమన్నా భాటియా (Tamannaah Bhatia), కీర్తి సురేష్ (Keerthy Suresh), సుశాంత్ (Sushanth) వంటి వారంతా సందడి చేశారు. ఇకపై సంగీత్ వంటి వేడుకలకు ఈ పాట ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచేలా.. ఈ సెలబ్రేషన్ సాంగ్‌ని డిజైన్ చేశారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (AK Entertainments) సంస్థపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Mani Sharma: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘మణి’హారం

**************************************

*Thaman S: ట్రోల్స్‌పై సంగీత దర్శకుడు థమన్ ఏమన్నారంటే..

**************************************

*Viraj Ashwin: ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందంటోన్న యంగ్ హీరో

**************************************

*Brahmaji: మొదటి సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్, యంగ్‌టైగర్.. తర్వాత మనం కష్టపడాల్సిందే..

**************************************

Updated Date - 2023-07-11T18:48:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!