ఆత్మలతో సంబంధం ఏమిటి?

ABN , First Publish Date - 2023-03-11T00:36:34+05:30 IST

కాజల్‌ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఘోస్టీ’. రాధిక, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.

ఆత్మలతో సంబంధం ఏమిటి?

కాజల్‌ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఘోస్టీ’. రాధిక, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. కల్యాణ్‌ దర్శకుడు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. ఉగాది సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘కాజల్‌ పోషించిన రెండు పాత్రలూ దేనికవే భిన్నమైనవి. ఓ పాత్రలో ఆమె పోలీస్‌గా కనిపిస్తారు. మరో పాత్రలో హీరోయిన్‌గా నటించారు. ఈ వినోద ప్రధాన కథలో హారర్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. ఈ రెండు పాత్రలకూ ఆత్మలకూ ఉన్న సంబంధం ఏమిటి? అనేది ఆసక్తికరం’’ అన్నారు దర్శకుడు. కె.ఎస్‌.రవికుమార్‌, ఊర్వశి, సత్యన్‌, సంతాన భారతి తదితరులు నటించారు.

Updated Date - 2023-03-11T00:37:07+05:30 IST