GTA: గేమ్ ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ యాక్షన్ డ్రామా.. రిలీజ్‌కు రెడీ

ABN , First Publish Date - 2023-09-22T18:54:38+05:30 IST

అశ్వత్థామ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరోహీరోయిన్లు‌గా రూపుదిద్దుకున్న క్రైమ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘GTA’ (గన్స్, ట్రాన్స్, యాక్షన్). ఈ సినిమాని అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

GTA: గేమ్ ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ యాక్షన్ డ్రామా.. రిలీజ్‌కు రెడీ
GTA Movie Poster

అశ్వత్థామ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరోహీరోయిన్లు‌గా రూపుదిద్దుకున్న క్రైమ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘GTA’ (గన్స్, ట్రాన్స్, యాక్షన్). ఈ సినిమాని అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీపక్ సిద్ధాంత్ (Deepka Siddhanth) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ని.. రచయిత, దర్శకుడైన కృష్ణ చైతన్య చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

పోస్టర్ విడుదల అనంతరం కృష్ణ చైతన్య (Krishna Chaitanya) మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న GTA (Guns Trance Action) సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 90కిడ్స్‌కు కనెక్ట్ అయ్యే విధంగా క్యాచీ టైటిల్‌తో ఈ సినిమా రాబోతోంది. కొన్ని విజువల్స్ చూశాను. అద్భుతంగా ఉన్నాయి. క్రైమ్ యాక్షన్ ప్రియులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని అన్నారు. (GTA Ready to Release)


GTA-Movie.jpg

దర్శకుడు దీపక్ సిద్ధాంత్ మాట్లాడుతూ.. క్రైమ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. GTA అనే గేమ్‌ను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించాం. సినిమా చాలా బాగా వచ్చింది. రిలీజ్ డేట్ పోస్టర్‌ని విడుదల చేసి.. మాకెంతో సహకరించిన కృష్ణ చైతన్యగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్టోబర్ 6న చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నామని తెలిపారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు గ్యారీ బి.హెచ్ ఎడిటర్‌గా, కె.వి.ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Agent: ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడోచ్..

*********************************

*Perarasu: అలా చేయడం వల్ల కోలీవుడ్ సినీ కార్మికులు నష్టపోతున్నారు

*********************************

*Tiger Nageswara Rao: అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు.. ‘వీడు’

********************************

*Vijay Antony: ‘నా కూతురి చావుతోనే, నేనూ చనిపోయా’.. కన్నీళ్లు పెట్టిస్తోన్న విజయ్ ఆంటోని లేఖ

*******************************

Updated Date - 2023-09-22T19:00:08+05:30 IST