Waltair Veerayya: సెన్సార్ పూర్తి.. సంక్రాంతికి సిద్ధం

ABN , First Publish Date - 2023-01-02T19:08:32+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). ఈ సినిమాకు..

Waltair Veerayya: సెన్సార్ పూర్తి.. సంక్రాంతికి సిద్ధం
Waltair Veerayya Movie

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది ఫ్యాన్స్‌తో పూనకాలు తెప్పిస్తోన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)ల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్స్‌తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ఇప్పటికే బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. (Waltair Veerayya Censor Talk)

సంక్రాంతి (Sankranthi) బరిలో ఉన్న చిత్రాలన్నింటి కంటే ఒక అడుగు ముందే ఉన్నామనేలా.. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి.. రేసులో దించేందుకు మేకర్స్ సిద్ధం చేశారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. పాటలు, ఎంటర్ టైన్‌మెంట్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అద్భుతంగా వున్నాయని.. చిరంజీవి, రవితేజలని కలసి తెరపై చూడటం పండగలా వుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్‌ని అభినందించినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి సరసన శృతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. జికె మోహన్ సహ నిర్మాత. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించారు. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది.

Updated Date - 2023-01-02T19:08:34+05:30 IST