సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Salman khan - Vicky kaushal Issue: విక్కీ కౌశల్‌ను నెట్టేశారు.. ఏమన్నాడంటే

ABN, First Publish Date - 2023-05-27T15:58:25+05:30

సల్మాన్‌ (Salman khan)వ్యక్తిగత సిబ్బంది విక్కీ కౌశల్‌ను (Vicky kaushal) పక్కకు లాగిన వీడియో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సల్మాన్‌ (Salman khan)వ్యక్తిగత సిబ్బంది విక్కీ కౌశల్‌ను (Vicky kaushal) పక్కకు లాగిన వీడియో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదంతా ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల (ఐఫా) - 2023 మీడియా సమావేశం వేదికగా జరిగింది. తోటి నటుడిని సిబ్బంది అలా పక్కకు లాగేయడం ఏంటి అని విక్కీ అభిమానులు మండిపడుతున్నారు. దీంతో సల్మాన్‌ అభిమానులు రంగంలోకి దిగి మరో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఆ ఘటన తర్వాత జరిగిన మరో కార్యక్రమంలో సల్మాన్‌, విక్కీ కౌశల్‌ కలిసి వేదికను పంచుకున్న వీడియోను సల్మాన్‌ అభిమానులు నెట్టింట వదిలారు. అందులో సల్మాన్‌ నేరుగా వెళ్లి, విక్కీ కౌశల్‌ను హగ్‌ చేసుకున్నాడు. ఇరువురు సరదాగా మాట్లాడుకున్నారు. తాజాగా ఈ ఘటనపై విక్కీ కౌశల్‌ స్పందించారు. ‘‘ఎన్నో సందర్భాల్లో చిన్న విషయాలు, అసవసరమైనవి పెద్దవిగా కనపడతాయి. అందుకు కారణం కూడా ఏమీ ఉండదు. సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్న వీడియోలో చూసినట్లు అక్కడేమీ జరగలేదు. అసలు ఆ విషయం గురించి మాట్లాడటానికి ఏమీ లేదు’’ అని అన్నారు.

అసలు ఏం జరిగిందంటే.. ఐఫా ఈవెంట్‌లో పాల్గొన్న వారితో విక్కీకౌశల్‌ ఫొటోలు దిగుతుండగా.. అదే సమయంలో సల్మాన్‌ఖాన్‌ అటువైపు వచ్చారు. దీంతో ఆయన బాడీగార్డ్స్‌ విక్కీని పక్కకు నెట్టేశారు. మరోవైపు, విక్కీ ఏదో మాట్లాడుతున్నప్పటికీ సల్మాన్‌ ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు వైరల్‌ అవుతున్న వీడియోలో కనిపించారు.

Updated Date - 2023-05-27T15:58:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!