Vicky Kaushal - Katrina Kaif: ఆదర్శవంతమైన భర్త అనుకోను!

ABN , First Publish Date - 2023-02-02T15:32:23+05:30 IST

బాలీవుడ్‌లో క్యూట్‌ లవర్స్‌గా(bollywood cute pair) పేరొంది, వివాహబంధంతో ఒకటయ్యారు కట్రీనా కైఫ్‌(Katrina kaif), విక్కీ కౌశల్‌(Vicky Kaushal) . సోషల్‌ మీడియాలో వీరిద్దరు భలే సరదాగా అభిమానులతో టచ్‌లో ఉంటారు.

Vicky Kaushal  - Katrina Kaif: ఆదర్శవంతమైన భర్త అనుకోను!

బాలీవుడ్‌లో క్యూట్‌ లవర్స్‌గా(bollywood cute pair) పేరొంది, వివాహబంధంతో ఒకటయ్యారు కట్రీనా కైఫ్‌(Katrina kaif), విక్కీ కౌశల్‌(Vicky Kaushal) . సోషల్‌ మీడియాలో వీరిద్దరు భలే సరదాగా అభిమానులతో టచ్‌లో ఉంటారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో విక్కీ కౌశల్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్యుకోవడానికే ట్రై చేస్తాను. అందుకు రకరకాల కారణాలున్నాయి. ‘‘నటుడిగా, భర్తగా, ఓ కొడుకుగా, స్నేహితుడిగా ఎందులోనూ ఇంకా పరిపూర్ణత సాధించలేదు. ఈ విషయాల్లో ప్రతి క్షణం మెరుగు పరచుకోవాలని తపన పడుతుంటా. ఏ విషయంలోనైనా పర్ఫెక్ట్‌గా ఉండటమే టార్గెట్‌గా పని చేస్తుంటా. నేనొక ఆదర్శవందమైన భర్త అని అనుకోను. కానీ నిన్నటి కంటే ఈరోజు బెటర్‌గా ఉండటానికి ట్రై చేస్తుంటా. నాలోని పొరపాట్లను సరిచేసుకోవడానికి ఎప్పుడూ సిద్థంగా ఉంటాను’’ అన్నారు. ( i am not idol husbend)

కట్రీనా కైఫ్‌ గురించి మాట్లాడుతూ ‘‘క్యాట్‌ నా జీవితంలోకి రావడం నా లైఫ్‌ మొత్తం మారిపోయింది. ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నేనొక మంచి వ్యక్తిగా ఎదగడానికి ఆమె ఎంతో సహకరిస్తోంది’’ అని అన్నాడు.( bollywood couple)

Updated Date - 2023-02-02T15:32:24+05:30 IST