The Kerala Story: 10 సన్నివేశాలు తొలగించాల్సిందే!

ABN , First Publish Date - 2023-05-02T17:20:06+05:30 IST

హిందీలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం వివాదాల్లో చిక్కుతుంది. ఇప్పుడీ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

The Kerala Story: 10 సన్నివేశాలు తొలగించాల్సిందే!

హిందీలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ (The kerala Story) చిత్రం వివాదాల్లో చిక్కుతుంది. ఇప్పుడీ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌ పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్‌ (Gets A certificate) పొందింది. అయితే ఈ చిత్రంలో అభ్యంతరకరంగా ఉన్న కొన్ని సన్నివేశాలను తొలగించాలని, దేవుళ్లకు సంబంధించిన సంభాషణలు, శత్రు దేశాన్ని ఉద్దేశించి రాసిన డైలాగులు, మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న అన్ని సన్నివేశాలపై సెన్సార్‌ కోత విధించింది. వివాదస్పదంగా ఉన్న డైలాగ్‌లను తొలగించాలని సూచించింది. మొత్తం మీద 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని పేర్కొంది. సినిమాలో ఉన్న కేరళ మాజీ సీఎం ఇంటర్వ్యూ సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్‌బోర్డు తెలిపింది. అయితే సినిమా విడుదల నిలిపి వేయాలని కేరళ ప్రభుత్వం, ప్రతిపక్షంతోపాటు కేరళవాసులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే! సినిమా విడుదలపై విధించాలని కోరుతూ సుప్రీం కోర్డులో దాఖలైన అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. ‘‘ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సవాల్‌ విసురుతూ విడుదలను అడ్డుకోవాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’’ అని కోర్టు తెలిపింది. అదాశర్మ, సిద్ధి ఇద్నానీ కీలక పాత్రధారులుగా సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మించారు. (The kerala story Censored)

The Kerala Story: ‘కేరళ స్టోరీ’లో అలా చూపించడమే వివాదానికి కారణమా?

Tollywood Releases: ఈ వారం సందడి చేసే చిత్రాలివే!

Updated Date - 2023-05-02T17:20:06+05:30 IST