Tollywood Releases: ఈ వారం సందడి చేసే చిత్రాలివే!

ABN , First Publish Date - 2023-05-02T15:17:31+05:30 IST

వేసవి సీజన్‌ మొదలైంది. సినిమాలకు మంచి సీజన్‌ అయిన వేసవిలో కూల్‌ కూల్‌ ఎంటర్‌టైనర్స్‌ థియేటర్స్‌, ఓటీటీల్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.

Tollywood Releases: ఈ వారం సందడి చేసే చిత్రాలివే!

వేసవి సీజన్‌ మొదలైంది. సినిమాలకు మంచి సీజన్‌ అయిన వేసవిలో కూల్‌ కూల్‌ ఎంటర్‌టైనర్స్‌ థియేటర్స్‌(Theatre Releases), ఓటీటీల్లో (OTT) సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ వారం వివిధ మాధ్యమాల్లో సందడి చేసే చిత్రాలేంటో చూద్దాం.

గోపీచంద్‌, డింపుల్‌ హయాతీ జంటగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రం ‘రామబాణం’.(Ramabanam) శ్రీవాస్‌ దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రధారులు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరోపక్క గోపీచంద్‌, డింపుల్‌ హయాతీ మధ్య కెమిస్ర్టీ కూడా మెప్పించేలా ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొంది ఈ చిత్రంలో గోపీచంద్‌ భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు చక్కని విజయం అందుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఓ పాట వివాదానికి దారి తీసింది. తన పాటను కాపీ చేసి తమ చిత్రంలో వాడుకున్నారంటూ కరీంనగర్‌కు చెందిన జాపనద కళాకారుడు గొల్లపల్లి రవీందర్‌ మీడియాను ఆశ్రయించారు.

Untitled-1.jpg

నరేశ్‌ సరికొత్త ప్రయత్నం...( Naresh Ugram)

అల్లరి నరేశ్‌ తన రూట్‌ మార్చి నటించిన చిత్రం ‘ఉగ్రం’. మిర్నా కథానాయిక. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ స్ర్కీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ నెల 5న ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నారు. మన దేశంలో ప్రతి నెలా దాదాపు 65 వేల మంది కనిపించకుండా పోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఆ ఊళ్లో ఎంతో మంది ఆడకూతుళ్లతో సహా... ఓ పోలీస్‌ భార్య, కూతురు కూడా మిస్‌ అయ్యారు. వాళ్లంతా ఏమయ్యారు? జాడ తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన ఆ పోలీస్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ పోలీస్‌ పోరాటం ఎలా సాగింది అన్నది అన్నది ఈ చిత్రం చూసి తెలుసుకోవలసిందే అని దర్శకుడు చెబుతున్నారు.

2.jpg

‘యాద్గిరి అండ్‌ సన్స్‌’

వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాద్గిరి అండ్‌ సన్స్‌. అనిరుద్‌ తుకుంట్ల, యశ్విని నివేదిత, జీవా, రాజీవ్‌ కనకాల, మురళీధర్‌గౌడ్‌, మధుమణి, రోహిత్‌ ఇతర పాత్రధారులు. బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5న థియేటర్‌లలో విడుదల కానుంది.

రోషన్‌, ముస్తఫ, శ్రీనివాస్‌, అనిరుద్‌, ఇందు, శ్రీవల్లి, విజయ, జబర్దస్త్‌ సత్తిపండు కీలక పాత్రధారులుగా నటించిన చిత్రం ‘అరంగేట్రం’. శ్రీనివాస్‌ ప్రభాస్‌ దర్శకుడు. మహేశ్వరి నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

మీటర్‌: (తెలుగు)

తూ ఝూటీ మై మక్కార్‌ (హిందీ)

3 (తెలుగు)

యోగి (తెలుగు)

రౌడీ ఫెలో (తెలుగు)

తమ్ముడు (తెలుగు)

క్లిఫర్డ్‌: ది బిగ్‌ రెడ్‌ డాగ్‌ (ఇంగ్లీష్‌)

ది టేర్‌ (ఇంగ్లీష్‌) మే 2

క్వీన్‌ షార్లెట్‌: ఏ బ్రిడ్జిర్టన్‌ స్టోరీ (వెబ్‌సిరీస్‌)

శాంక్చురీ (మూవీ)

ది లార్వా ఫ్యామిలీ(యామినేషన్‌)

అమృతం చందమామలో (తెలుగు)

డిస్నీ+హాట్‌స్టార్‌

మే 5 - కరోనా పేపర్స్‌ (మలయాళ చిత్రం )

సాస్‌ బహూ ఔర్‌ ఫ్లమింగో (హిందీ)

జీ 5

మే 5 - ఫైర్‌ ఫ్లైస్‌ (హిందీ సిరీస్‌)

షెభాష్‌ ఫెలూద (బెంగాలీ)

Updated Date - 2023-05-02T16:01:41+05:30 IST