scorecardresearch

Farzi: రూల్స్‌ను మార్చలేకపోతే.. గేమ్‌నే ఛేంజ్ చెయ్

ABN , First Publish Date - 2023-01-13T17:18:55+05:30 IST

‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) వెబ్‌సిరీస్‌తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న మేకర్స్ రాజ్ అండ్ డీకే (Raj and DK). ఈ వెబ్‌సిరీస్ ఇచ్చిన కిక్‌తో మరో ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Farzi: రూల్స్‌ను మార్చలేకపోతే.. గేమ్‌నే ఛేంజ్ చెయ్

‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) వెబ్‌సిరీస్‌తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న మేకర్స్ రాజ్ అండ్ డీకే (Raj and DK). ఈ వెబ్‌సిరీస్ ఇచ్చిన కిక్‌తో మరో ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఫర్జీ (Farzi) టైటిల్‌తో తెరకెక్కించారు. షాహిద్ కపూర్ (Shahid Kapoor), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలు పోషించారు. ఈ షో ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 10నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఫర్జీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘‘డబ్బు సంతోషనివ్వదు.. కానీ, డబ్బును సంపాదించలేనివారే ఈ డైలాగ్ చెబుతారు’’, ‘‘ధనవంతులు ఓ సిస్టమ్‌ను తయారు చేశారు..ఈ సిస్టమ్‌లో ధనవంతులు అత్యంత ధనవంతులుగా, పేదవారు ఎప్పుడు అప్పులో కూరుకుపోతారు’’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. నకిలీ కరెన్సీని ముద్రించే వ్యక్తిగా షాహిద్ కనిపించాడు. రూల్స్‌ను మార్చలేకపోతే.. గేమ్‌నే ఛేంజ్ చెయ్ అనే నినాదాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాడు. నిజాయతీ కలిగిన పోలీసాఫీసర్ పాత్రను విజయ్ సేతుపతి పోషించాడు. నకిలీ కరెన్సీ గ్యాంగ్ ఆటకట్టించే పాత్రలో కనిపించాడు షాహిద్ కపూర్ ఈ షోతోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డీ ‌టు ఆర్ ఫిలిమ్స్ నిర్మించింది. ఈ వెబ్‌సిరీస్‌లో కేకే. మీనన్, రాశీ ఖన్నా, భువన్ అరోరా, రెజీనా కసాండ్రా, కుబ్ర సైత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు

Updated Date - 2023-01-13T17:18:56+05:30 IST