ShahRukhKhan: షారూక్ ‘జవాన్’ ట్రైలర్ విడుదలకి చాలా పెద్ద ప్లాన్ వేసాడు

ABN , First Publish Date - 2023-07-04T10:54:13+05:30 IST

'పఠాన్' సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన రాబోయ్ సినిమా 'జవాన్' ప్రచారాలకు పెద్ద ప్లేన్ వేసాడు. ముందుగా ఈ సినిమా ట్రైలర్ జులై 12 న ఒక హాలీవుడ్ సినిమాతో పాటుగా థియేటర్స్ లో చూడమంటున్నాడు

ShahRukhKhan: షారూక్ ‘జవాన్’ ట్రైలర్ విడుదలకి చాలా పెద్ద ప్లాన్ వేసాడు
Shah Rukh Khan from Jawan

ఈ సంవత్సరం ఏదైనా ఒక హిందీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడింది అంటే, అది బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ (ShahRukhKhan) నటించిన 'పఠాన్' (Pathaan) సినిమా. ఎందుకంటే ఈమధ్య కాలంలో ఒక్క హిందీ సినిమా కూడా విజయం సాధించకపోవడంతో, హిందీ చిత్ర పరిశ్రమలో ఒక నిరాశ లాంటిది ఏర్పడింది. ఆ సమయంలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ #Pathaan చిత్రం విడుదలై వరల్డ్ వైడ్‌గా సెన్సేషనల్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకోవటమే కాకుండా, హిందీ పరిశ్రమలో ఒక కొత్త ఊపునిచ్చింది.

Jawan-Pic.jpg

అదే షా రుఖ్ ఖాన్ ఈ సంవత్సరం మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై ‘జవాన్’ #Jawan అనే చిత్రంతో దండ‌యాత్ర చేసి బాక్సాఫీస్‌ను కొల్ల‌గొట్ట‌డానికి రెడీ అయ్యారు. దీని కోసం ఆయ‌న అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న (Jawan releasing on September 7) తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ‘జవాన్’ #JawanTrailer ట్రైలర్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురావ‌టానికి మేక‌ర్స్ భారీ స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే 'పఠాన్' హిట్ అవటంతో, షారుఖ్ కొత్త ఉత్సాహంతో తన 'జవాన్' ట్రైలర్ ని విడుదల చెయ్యడానికి చాలా పెద్ద ప్లేన్ వేసాడు. టామ్ క్రూజ్ (TomCruise) నటిస్తున్న హాలీవుడ్ సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ (MissionImpossible) సినిమా విడుదలప్పుడు జులై 12 న థియేటర్స్‌లో ఈ 'జ‌వాన్' ట్రైల‌ర్‌ను #JawanTrailer కూడా చూడవచ్చు అని చెపుతున్నారు. ఈ సినిమా కోసం షారూక్ ఖాన్ ఎవ‌రూ ఊహించ‌ని స‌రికొత్త లుక్‌లోకి మారారు. ఆ లుక్‌ను చూసి ఆయ‌న అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. దీంతో షారూక్ ఖాన్ పాత్ర ఎలా ఉండబోతుందోన‌ని అంద‌రిలో ఉత్కంఠ‌త నెల‌కొంది. దీంతో జ‌వాన్ మూవీ ట్రైల‌ర్‌ను చూడాల‌ని అంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

Nayanthara.jpg

ఇక్కడ ఇంకొక ఆసక్తికరం అంశం కూడా వుంది. ఈసారి షారూక్ ఖాన్ దక్షిణాదికి చెందిన దర్శకుడితో పని చేస్తున్నాడు. యువ దర్శకుడు అట్లీ (Atlee) తమిళంలో తలపతి విజయ్ (ThalapathyVijay) తో మూడు సినిమాలు చేసాడు. ఇప్పుడు ఈ షారుఖ్ ఖాన్ 'జవాన్' కి కూడా అతనే దర్శకుడు. ఈ సినిమాలో నయనతార (Nayanthara), విజయ్ సేతుపతి (VijaySethupathi) కూడా నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఈ చిత్రాన్ని స్వంతగా నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-07-04T10:58:42+05:30 IST