Shah Rukh Khan: 'జవాన్' చరిత్ర సృష్టిస్తుందా... అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అలానే అనిపిస్తోంది

ABN , First Publish Date - 2023-09-06T15:01:29+05:30 IST

హిందీ చలన చిత్ర పరిశ్రమకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. ఆమధ్య కొన్ని సంవత్సరాల పాటు ఒక్క హిట్ అయినా లేకుండా పోయినా పరిశ్రమలో షా రుఖ్ ఖాన్ తన 'పఠాన్' సినిమాతో విజయం రుచి చూపించాడు. వరసగా కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ 'జవాన్' తో వస్తున్నాడు, ఈ సినిమా తో షారుఖ్ ఖాన్ చరిత్ర సృష్టించి బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకొస్తాడు అని అంటున్నారు.

Shah Rukh Khan: 'జవాన్' చరిత్ర సృష్టిస్తుందా... అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అలానే అనిపిస్తోంది
Shah Rukh Khan from Jawan

షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) నటించిన 'జవాన్' #Jawan రేపు విడులవుతోంది. అట్లీ (Atlee) దీనికి దర్శకుడు కాగా, నయనతార (Nayanthara), దీపికా పడుకోన్ (DeepikaPadukone), విజయ్ సేతుపతి (VijaySethupathi), యోగిబాబు (YogiBabu) ఇంకా చాలామంది నటులు ఇందులో ముఖ్యమైన పాత్రలు ధరిస్తున్నారు. ఈ సినిమా ఎన్నడూ లేనంత విధంగా హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఒక్క హిందీలోనే కాకుండా, దక్షిణాది భాషలు అన్నిటిలో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఈ సినిమా మళ్ళీ ఒక చరిత్ర సృష్టిస్తుందని అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్స్.

ఈ సినిమా ఉదయం 6 గంటలకే షోస్ ప్రారంభిస్తున్నారు, అయినా అవి తొందరగా ఫిల్ అయిపోతున్నాయి. అంటే ఈ సినిమా కోసం ఎంత డిమాండ్ ఉందొ తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనపడనున్నాడు. ఇది ఒక యాక్షన్ డ్రామా గా అట్లీ తెరకెక్కించాడు. నయనతార మొదటిసారిగా షారుఖ్ ఖాన్ తో నటించింది. అలాగే విజయ్ సేతుపతి కూడా.

jawan-shahrukhkhan1.jpg

మొదటి సారిగా షారుఖ్ ఖాన్ సినిమాలో దక్షిణాదికి చెందిన ఎక్కువమంది నటీనటులు ఉండటం కూడా విశేషమే. ఈ సినిమా పాటలు అన్నీ కూడా దక్షిణాది భాషల్లో విడుదలయ్యాయి. అలాగే ప్రియమణి (Priyamani) కూడా ఇందులో నటిస్తోంది. ఈసారి అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే 'గదర్ 2' #Gadar2 ని దాటిపోయాయి అని కూడా అంటున్నారు.

అలాగే షారుఖ్ ఖాన్ 'పఠాన్' #Pathaan తో హిందీలో చాలా సంవత్సరాల తరువాత ఒక పెద్ద హిట్ చూసారు. ఆ తరువాత చాలా సినిమాలు వరసగా హిట్ అయ్యాయి. 'గదర్ 2', 'డ్రీం గర్ల్' (DreamGirl), 'ఓ మై గాడ్ 2' (OMG2), 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' ఇలా చాలా హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ 'జవాన్' వస్తోంది. అంటే బాలీవుడ్ పూర్వ వైభవం మళ్ళీ పుంజుకుంటోంది అని అంటున్నారు. ప్రేక్షకులు సినిమా థియేటర్స్ వచ్చి సినిమాలు చూడటం అలవాటయింది. 'పఠాన్' తరువాత మళ్ళీ షా రుఖ్ ఖాన్ ఈ 'జవాన్' తో చరిత్ర తిరగరాయనున్నాడు అని నాటున్నారు. రేపు విడుదలవుతోంది, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి!

Updated Date - 2023-09-06T15:14:56+05:30 IST