scorecardresearch

ShahRukhKhan: బాలీవుడ్ బాద్ షా కి యాక్సిడెంట్, ముక్కుకి సర్జరీ

ABN , First Publish Date - 2023-07-04T15:23:41+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ షా రుఖ్ ఖాన్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఒక సినిమా షూటింగ్ చేస్తుండగా యాక్సిడెంట్ కు గురయ్యారని, అతని ముక్కుకి గాయాలు అయ్యాయని తెలిసింది.

ShahRukhKhan: బాలీవుడ్ బాద్ షా కి యాక్సిడెంట్, ముక్కుకి సర్జరీ
Shah Rukh Khan in Jawan

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) అమెరికాలోని లోడ్ ఏంజెల్స్ లో షూటింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురైనట్టుగా సమాచారం వచ్చింది. (Shah Rukh Khan injured while shooting in Los Angels) షా రుఖ్ ఖాన్ ఒక సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్లాడని, అక్కడ షూటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, షారుఖ్ ముక్కుకి దెబ్బ తగిలినట్టుగా తెలిసింది. వెంటనే అక్కడే హాస్పిటల్ కి తీసుకు వెళ్లి అతని ముక్కుకి సర్జరీ చేశారని కూడా తెలిసింది. ప్రస్తుతం షా రుఖ్ ఖాన్ ఇండియా వచ్చాడని, ఇక్కడ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నదని బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేశాయి.

అయితే ఈ విషయం ఆ స్టార్ టీము నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు, కానీ షారుఖ్ ఖాన్ ముక్కుకు బ్యాండేజ్‌తో లాస్ ఏంజిల్స్‌ విమానాశ్రయంలో కనిపించారని, ఇక అక్కడ నుండి ఈ వార్త వైరల్ అయిందని, దానితో కొంతమంది మీడియా ఏమైందని అనుకుంటే, ముక్కుకి దెబ్బ తగిలిందని తెలిసింది.

shahrukhkhan.jpg

షారుఖ్ తదుపరి సినిమా 'జవాన్' #Jawan విడుదలకి రెడీ అవుతోంది, దీనికి అట్లీ (Atlee) దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ #JawanTriler ని ఈనెల 12వ తేదీన, టామ్ క్రూజ్ (TomCruise) నటిస్తున్న హాలీవుడ్ సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ (MissionImpossible) సినిమాతో థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ 'జవాన్' సినిమా కోసం షారూక్ ఖాన్ ఎవ‌రూ ఊహించ‌ని స‌రికొత్త లుక్‌లోకి మారారు. ఈ సినిమాలో నయనతార (Nayanthara), విజయ్ సేతుపతి (VijaySethupathi) కూడా నటిస్తున్నారు.

Updated Date - 2023-07-04T15:23:41+05:30 IST

News Hub