Shah Rukh Khan: దేశమంతా 'జవాన్' ప్రభంజనం, రికార్డు ఓపెనింగ్

ABN , First Publish Date - 2023-09-08T12:57:04+05:30 IST

షా రుఖ్ ఖాన్ మరోసారి తన ప్రతాపాన్ని 'జవాన్' సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించాడు. ఈసారి ఒక్క హిందీలోనే కాదు, తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలై ఇక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించేట్టు చేస్తున్నాడు. మొదటి రోజు రికార్డు కాలకేషన్లను రాబట్టాడు, పెద్ద విజయం దిశగా దూసుకుపోతున్నాడు

Shah Rukh Khan: దేశమంతా 'జవాన్' ప్రభంజనం, రికార్డు ఓపెనింగ్
Bollywood Badshah Shah Rukh Khan is ruling the box office with his latest film 'Jawan'

షారుఖ్ ఖాన్ (ShahRukhKhan), తమిళ దర్శకుడు అట్లీ (Atlee) కాంబినేషన్ లో వచ్చిన 'జవాన్' #Jawan నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విడుదలైంది. ఒక్క హిందీలోనే కాకుండా దక్షిణాది భాషలన్నింటిలోనూ భారీగా విడుదల చేశారు ఈ సినిమాని. ఇందులో నయనతార (Nayanthara), విజయ్ సేతుపతి (VijaySethupathi), దీపికా పడుకోన్ (DeepikaPadukone), ప్రియమణి (Priyamani) ఇలా చాలామంది నటీనటులు వున్నారు. ఈ సినిమాకి చాలా హైప్ కూడా వచ్చింది. అలాగే ఈ సినిమా ఒక పైసా వసూల్ సినిమా ని, మాస్ ఎంటర్ టైనర్ అని ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కూడా రికార్డు స్థాయిలో వుంటాయని ట్రేడ్ అనలిస్ట్స్ ఊహించారు.

అందరి ఊహలకు అనుకున్నట్టుగానే ఈ సినిమా మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ సృష్టించి ఒక కొత్త రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు విడుదలైన సన్నీ డియోల్ (SunnyDeol) నటించిన 'గదర్ 2' #Gadar2, షారుఖ్ ఖాన్ సినిమా 'పఠాన్' #Pathaan కలెక్షన్స్ ని మించి 'జవాన్' మొదటి రోజు కలెక్షన్స్ వున్నాయి. ఇప్పటివరకు ఏ సినిమా కూడా మొదటి రోజు ఇంత కలెక్షన్స్ సాధించలేదు అనేంతగా ఈ 'జవాన్' సినిమా సాధించని అని చెపుతున్నారు. (Jawan record collections on the first day)

jawan-shahrukhkhan1.jpg

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం 'జవాన్' సినిమా మొదటి రోజు సుమారు రూ.75 కోట్ల రూపాయల నెట్ కలెక్టు చేసిందని, ఇందులో తమిళ, తెలుగు భాషల నుంచి చెరో రూ.5 కోట్ల వరకు కలెక్టు చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. అంటే ఇంతవరకు ఏ సినిమా ఇలా మొదటి రోజు ఇంత పెద్ద మొత్తంలో కలెక్టు చెయ్యలేదని కూడా అంటున్నారు. షారుఖ్ ఖాన్ 'పఠాన్' మొదటి రోజు రూ.57 కోట్లు కలెక్టు చేసిందని, 'వార్' సినిమా రూ.53 కోట్లు కలెక్టు చేస్తే, 'కెజిఫ్' రూ.54 కోట్లు కలెక్టు చేసిందని ఈమధ్యనే విడుదలైన 'గదర్ 2' రూ.40 కోట్లు కలెక్టు చేసినట్టుగా చెపుతున్నారు.

'జవాన్' రెండో రోజు కూడా కలెక్షన్స్ బాగుంటాయని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి చూస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి ఈ సినిమా రెండో రోజు కూడా రికార్డు కలెక్షన్స్ వుంటాయని అనుకుంటున్నారు. ఈ విధంగా చూసుకుంటే రేపు శని, ఆదివారాలు కూడా ఈ సినిమా కలెక్షన్స్ విపరీతంగా వుండే అవకాశం వుంది అని చెపుతున్నారు. 'జవాన్' సినిమా షారుఖ్ ఖాన్ కి కెరీర్ బెస్ట్ అవుతుందని కూడా అంటున్నారు. ఇక నయనతార మొదటిసారిగా ఇంత పెద్ద విజయంతో హిందీలో ఆరంగేట్రం చేసింది. అలాగే దర్శకుడు అట్లీ కూడా.

Updated Date - 2023-09-08T12:57:04+05:30 IST