Dunki: ‘డంకీ’ డ్రాప్ 1తో.. రికార్డులు బ‌ద్ద‌లు

ABN , First Publish Date - 2023-11-03T20:37:16+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘డంకీ’. ఈ సినిమా నుంచి డంకీ డ్రాప్ 1 రీసెంట్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దీనికి దేశం న‌లువైపుల నుంచి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌స్తోంది. డంకీ డ్రాప్ 1 విడుద‌లైన 24 గంట‌ల్లో ఏకంగా 72 మిలియ‌న్ వ్యూస్ సాధించి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

Dunki: ‘డంకీ’ డ్రాప్ 1తో..  రికార్డులు బ‌ద్ద‌లు
shah rukh khan

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్(Shah Rukh Khan), హృద‌యాల‌కు హ‌త్తుకునే ఎమోష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ రూపొందించే ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణి (Rajkumar Hirani) కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘డంకీ’(Dunki). ఈ సినిమా నుంచి డంకీ డ్రాప్ 1(Dunki Drop1) రీసెంట్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దీనికి దేశం న‌లువైపుల నుంచి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌స్తోంది. డంకీ డ్రాప్ 1 విడుద‌లైన 24 గంట‌ల్లో ఏకంగా 72 మిలియ‌న్ వ్యూస్ సాధించి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లుగా ప‌ని చేశారు. షారూఖ్ ఖాన్ చార్మింగ్ లుక్‌, రాజ్ కుమార్ హిరాణి టేకింగ్‌ల‌తో పాటు సోనూ నిగ‌మ్ అద్భుత‌మైన పాట‌తో వ‌చ్చిన‌ డంకీ డ్రాప్ 1(Dunki Drop1) కోట్లాది మంది ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను తాకి సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచింది.

విదేశాల‌కు వెళ్లి చ‌దువుకోవాల‌ని క‌ల‌లు క‌నే నలుగురు స్నేహితుల‌కు సంబంధించిన క‌థ‌ను రాజ్ కుమార్ హిరాణి ఇందులో సింపుల్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ప్రేమ‌, స్నేహం క‌ల‌యిక‌గా రూపొందించిన‌ ఈ సినిమా మ‌న‌లోని భావోద్వేగాల‌ను తాకుతూ చ‌క్క‌గా న‌వ్వుకునేలా, హృద‌యం ఆక‌ట్టుకునే విధంగా ఉండి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంటుంద‌ని అర్థ‌మ‌వుతుంది.


హృద్య‌మైన భావాల‌ను అందంగా చూపిస్తూ రాజ్‌కుమార్ హిరాణి(Rajkumar Hirani) ఈ సినిమాను రూపొందించారు. పాత్ర‌లను ఆయ‌న ఆవిష్క‌రించిన తీరు ప్రేక్ష‌కుల‌కు ఓ రోల‌ర్ కోస్ట‌ర్‌లా అనిపిస్తుంది. షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రం బోమ‌న్ ఇరాని, తాప్సీ ప‌న్ను, విక్కీ కౌశ‌ల్‌, విక్ర‌మ్ కొచ్చ‌ర్‌, అనీల్ గ్రోవ‌ర్ తదిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సినిమా ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌వనుంది.

Updated Date - 2023-11-03T20:37:20+05:30 IST