కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Keerthy Suresh : అక్క కోసం పయనం!

ABN, First Publish Date - 2023-12-12T11:55:21+05:30

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా రాణిస్తోంది కీర్తి సురేష్‌. ఈ ఏడాది 'మామన్నన్', 'భోళా శంకర్‌' చిత్రాలతో అలరించిన ఆమె ప్రస్తుతం తమిళంలో నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది. అంతే కాదు డిజిటల్‌ వరల్డ్‌లోకి ప్రవేశించింది.

Keerthy Suresh : అక్క కోసం పయనం!

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా రాణిస్తోంది కీర్తి సురేష్‌. ఈ ఏడాది 'మామన్నన్', 'భోళా శంకర్‌' చిత్రాలతో అలరించిన ఆమె ప్రస్తుతం తమిళంలో నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది. అంతే కాదు డిజిటల్‌ వరల్డ్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఆమె హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. అక్కడ కూడా తన సత్తా చాటుతానంటోంది. ‘అక్క’ అనే వెబ్‌సిరీస్‌లో కీలక పోషిస్తుంది. ఈ సిరీస్‌తో ధరమ్‌ రాజ్‌ ర్శకుడిగా పరిచయమవుతున్నారు. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తుంది. రివేంజ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్‌లో రాధిక ఆప్టే మరో కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సిరీస్‌ చిత్రీకరణలో పాల్గొనడానికి కీర్తి సిద్థమైనట్లు సమాచారం. ‘షూటింగ్‌ కోసం ముంబయికి పయనమైంది కీర్తి. ఈ సిరీస్‌లో కీర్తి, రాధికా ఆప్టేకు మధ్య ముఖాముఖి పోరాటాలు ఉంటాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-12-12T11:57:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!