Jawan: ఈ సినిమా ఆస్కార్స్ కి పంపుతాం: అట్లీ

ABN , First Publish Date - 2023-09-19T14:21:06+05:30 IST

'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ అవార్డు సాధించాక, ఇప్పుడు భారతీయ సినిమా దర్శకుల్లో చాలా నమ్మకం వచ్చింది. అందుకనే దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ తో తీసిన 'జవాన్' సినిమాని ఆస్కార్ కి పంపించాలని అనుకుంటున్నాని అన్నాడు.

Jawan: ఈ సినిమా ఆస్కార్స్ కి పంపుతాం: అట్లీ
A still from jawan

షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) నటించిన 'జవాన్' #Jawan సెప్టెంబర్ 7 వ తేదీన విడుదలై సంచలనం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బలంగా వున్న ఈ సినిమాని దక్షిణాదికి చెందిన అట్లీ (Atlee) దర్శకత్వం వహించాడు. అలాగే ఇందులో నయనతార (Nayanthara) కథానాయిక కాగా, విజయ్ సేతుపతి (VijaySethupathi) విలన్ గా నటించాడు. దీపికా పడుకోన్ (DeepikaPadukone) ఒక ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర విపరీతమైన వసూలు సాధించింది, షారుఖ్ ఖాన్ కి ఈ సంవత్సరం రెండో హిట్ ఇచ్చింది.

మొదటి హిట్ 'పఠాన్' #Pathaanకాగా రెండో సినిమా ఈ 'జవాన్'. ఈ సినిమా కి సంగీతం అనిరుద్ రవిచందర్ (AnirudhRavichander) అందించాడు. ఈ సినిమా విజయోత్సవాలు కూడా జరిగాయి. అలాగే దర్శకుడు అట్లీ ఒక్కసారిగా అందరూ మాట్లాడుకునే దర్శకుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. అతను ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ 'జవాన్' సినిమా ఆస్కార్ (OscarAward) కి పంపాలని అనుకుంటున్నట్టుగా చెప్పాడు. "నేను షారుఖ్ సర్ కి అడుగుతాను, అడిగి పంపిస్తారు. నాకయితే ఆస్కార్ కి పంపాలని వుంది" అని చెప్పాడు అట్లీ.

atlee2.jpg

"సినిమాకి పనిచేసే ప్రతి వ్యక్తి, సాంకేతిక నిపుణుడు, దర్శకుడు అందరూ కూడా తమ సినిమా గోల్డెన్ గ్లొబ్, ఆస్కార్, నేషనల్ అవార్డులలో తమ సినిమా ఉండాలని కోరుకుంటాడు. అలాగే నా 'జవాన్' సినిమా కూడా ఆస్కార్ లలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. చూదాం, ఇదే విషయం షారుఖ్ తో మాట్లాడుతాను, అతను నా ఇంటర్వ్యూ చూస్తున్నారు అనే అనుకుంటున్నాను," అని చెప్పాడు అట్లీ.

'జవాన్' సినిమా ఇప్పుడు వెయ్యికోట్ల క్లబ్ లోకి చేరిందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. గత వారం సెలవు రోజులు వరసగా రావటంతో ఈ సినిమాకి వసూళ్లు కూడా బాగున్నాయని అంటున్నారు.

Updated Date - 2023-09-19T14:21:30+05:30 IST