Saif Ali Khan: ఎవరికి నిజం తెలియదు.. ప్రతి ఒక్కరు అబద్ధాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారంటున్న హీరో..

ABN , First Publish Date - 2023-03-04T20:51:26+05:30 IST

సెలబ్రిటీలపై ప్రజల దృష్టి ఎప్పుడు ఉంటుంది. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అందువల్ల వారికి ప్రైవసీ అనేది ఉండదు. బయటికి వెళ్లితే మీడియా వెంటాడుతుంది. ఫొటోగ్రాఫర్స్ క్లిక్ మనిపిస్తుంటారు.

Saif Ali Khan:  ఎవరికి నిజం తెలియదు.. ప్రతి ఒక్కరు అబద్ధాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారంటున్న హీరో..

సెలబ్రిటీలపై ప్రజల దృష్టి ఎప్పుడు ఉంటుంది. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అందువల్ల వారికి ప్రైవసీ అనేది ఉండదు. బయటికి వెళ్లితే మీడియా వెంటాడుతుంది. ఫొటోగ్రాఫర్స్ క్లిక్ మనిపిస్తుంటారు. కొంత మంది కెమెరామెన్స్ ఈ విధంగానే సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), కరీనా కపూర్ (Kareena Kapoor) ను అర్ధరాత్రి 2గంటలకు వెంబడించారు. అపార్ట్‌మెంట్ గేటును దాటి లోపలికి చొరబడ్డారు. ఫలితంగా సైఫ్ అసహనానికి గురయ్యాడు. పిక్స్ తీసుకోవడానికి తమ బెడ్‌రూమ్‌లోనికి కూడా రావాలని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను సైఫ్ అలీ ఖాన్ తొలగించాడంటూ పలు వదంతులు షికార్లు కొట్టడం మొదలయ్యాయి. ఫలితంగా ఈ వార్తలన్నింటిపై సైఫ్ అలీ ఖాన్ స్పందించాడు.

‘‘బిల్డింగ్ సెక్యూరిటీ గార్డును తొలగించలేదు. ఈ ఘటనలో సెక్యూరిటీ తప్పేమీ లేదు. ఫొటోగ్రాఫర్స్‌కు వ్యతిరేకంగా నేను ఎటువంటి చట్టపరమైన చర్యలను తీసుకోవడం లేదు. మేం పార్టీ నుంచి వచ్చే సమాయానికి దాదాపుగా 20మంది ఫొటోగ్రాఫర్స్ అక్కడ ఉన్నారు. మా మీద లైట్స్‌ను ఫోకస్ చేశారు. అర్ధరాత్రి పూట ఈ విధంగా చేయడం సరైనదేనా..? కెమెరామెన్స్ ప్రవర్తించాల్సిన తీరు కాదిది. ప్రతి ఒక్కరు వారి హద్దుల్లో ఉండాలి. మా ఇంటి బయట ఎల్ల వేళలా ఫొటోగ్రాఫర్స్‌కు నేను సహకరించాను. వారు మా ప్రైవేట్ స్పేస్‌లోకి వచ్చి గీతను మితిమీరారు. అందుకే బెడ్ రూం కామెంట్స్ చేయాల్సి వచ్చింది. పిల్లలు ఆట పాటలు ఆడుతున్నప్పుడు కూడా వీడియోలు షూట్ చేస్తున్నారు. ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. పాఠశాల లోపలికి రాకూడదు. ఎవరికి నిజం తెలియదు. ప్రతి ఒక్కరు అబద్ధాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. అందరికి ధన్యవాదాలు’’ అని సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. ఇక సైఫ్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ‘ఆది పురుష్’ (Adipurush) లో నటించారు. రావణుడి పాత్రను పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 విడుదల కానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-04T20:51:28+05:30 IST