Waltair Veerayya: బాస్, మాస్.. కలిసి ఇచ్చిన మెగా మాస్ ట్రీట్

ABN , First Publish Date - 2022-12-30T18:49:23+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) కాంబినేషన్‌లో.. బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోన్న..

Waltair Veerayya: బాస్, మాస్.. కలిసి ఇచ్చిన మెగా మాస్ ట్రీట్
Waltair Veerayya Poonakaalu Loading Song Out

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) కాంబినేషన్‌లో.. బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ‘బాస్ పార్టీ’, ‘శ్రీదేవి చిరంజీవి’, ‘వీరయ్య టైటిల్ ట్రాక్’ సాంగ్స్ బీభత్సమైన స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని నాల్గవ పాట ‘పూనకాల లోడింగ్’ (Poonakaalu Loading)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్‌తోనే నిజంగానే పూనకాలు వచ్చేలా చేసింది చిత్ర బృందం. చిరంజీవి, రవితేజ కలిసి ఉన్న పోస్టర్ వదిలి.. ‘పూనకాల లోడింగ్’ మాములుగా ఉండదనేలా క్లారిటీ ఇచ్చేశారు. ఇక తాజాగా విడుదలైన ఈ పాటతో మెగా ఫ్యాన్స్‌ని ఆపడం ఎవరితరం కావడం లేదంటే.. ఏ రేంజ్‌లో ఈ పాట ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక రోజు ముందే న్యూ ఇయర్ సంబరాలను అంబరాన్ని అంటేలా.. మెగా ఫ్యాన్స్ ఈ పాట విడుదల వేడుకలో నిర్వహించడం విశేషం.

మరో విశేషం ఏమిటంటే.. ఈ పాటకు చిరంజీవి, రవితేజ కూడా గొంతు కలిపారు. ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్..’ అంటూ చిరు, రవితేజ పోటాపోటీగా పాడటం, సిగ్నేచర్ స్టెప్స్, దేవిశ్రీ మాస్ బీట్స్, రోల్ రిడా లిరిక్స్.. ఇలా అన్నీ ఈ పాటని ఓ స్థాయిలో నిలబెట్టేశాయి. పండక్కి పర్ఫెక్ట్ సాంగ్ అనేలా ఈ పాటని శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. మొత్తంగా అయితే.. సంక్రాంతికి బాస్, మాస్‌‌ల కలయికతో వస్తున్న ఈ సినిమా.. మెగా మాస్ ట్రీట్ ఇవ్వబోతుందనేది మరోసారి ఈ పాటతో మేకర్స్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. కాగా.. చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. (Waltair Veerayya Poonakaalu Loading Song)

Updated Date - 2022-12-30T18:49:25+05:30 IST