సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mega Star Chiranjeevi: వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ అదరగొడుతున్నారు

ABN, First Publish Date - 2022-12-29T15:07:54+05:30

సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల్లో మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi and Mass Maharaja Ravi Teja) మరియు మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) ప్రమోషన్స్ అదరగొడుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల్లో మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi and Mass Maharaja Ravi Teja) మరియు మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) ప్రమోషన్స్ అదరగొడుతున్నారు. ఒక పక్క సాంఘీక మాధ్యమాల్లో, అలాగే ఇంకో పక్క మీడియా సమావేశాల్లో సినిమా గురించి, అందులోని పాటలు, డైలాగులు ఇంకా ఒకటేంటి ఇప్పుడు ప్రతి దగ్గరా 'వాల్తేరు వీరయ్య' అంటున్నారు. ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవిని పాటలో చూసిన అభిమానులు, మెగాస్టార్ గ్రేస్, లుక్స్ చాలా బాగున్నాయని, డాన్స్ అదరగొట్టారని, అదీ కాకుండా చాలా అందంగా కూడా కనపడుతున్నారని ఒకటే ప్రశంసలు కురిపిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' లోని ఇంకో పాట కూడా రేపు అంటే శుక్రవారం విడుదల చేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

చిరంజీవి, దర్శకుడు కొల్లి బాబీ (Director Bobby Kolli) ఈ సినిమా ఫలితం మీద చాలా నమ్మకంగా వున్నారు. మొన్న జరిగిన మీడియా కాన్ఫరెన్స్ కి వాళ్లిద్దరూ సినిమా చూసి వచ్చి మాట్లాడారు కాబట్టి, వాళ్ళు అంత నమ్మకంగా వున్నారు అని తెలుస్తోంది. అదీ కాకుండా, బాబీ, చిరంజీవి గారికి ఒక పెద్ద అభిమాని కావటం, (Director Bobby is a big fan of Chiranjeevi) అతన్ని ఎలా చూపిస్తే అభిమానులకి నచ్చుతుంది అని అనుకున్నాడో అలానే చిరంజీవి గారిని తెర మీద చూపించాడని కూడా తెలిసింది. ఇప్పటికే పాటలు జనరంజకంగా వుండి, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా, ఎప్పుడు చిరంజీవి గారి డాన్స్ చూద్దామా అన్నట్టుగా వున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ 'వాల్తేరు వీరయ్య' కి మంచి ట్యూన్స్ ఇవ్వటం లో సఫలం అయ్యాడు. ఈ సినిమాలో శృతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటించింది.

అలాగే, ఈ సినిమా కోసం ఒక హార్బర్ సెట్ అల్యూమినియం ఫ్యాక్టరీ (Harbour set in Aluminium factory for this film) లో వేశారు. ఈ సెట్ లో 'బాస్ పార్టీ' సాంగ్ (Boss Party song) చిత్రీకరించటం జరిగింది. ఈ సెట్ కోసం భారీగానే ఖర్చు పెట్టారని తెలిసింది. అయితే ఇదే సెట్ లో 'వాల్తేరు వీరయ్య' ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టి, కొత్త సంవత్సర వేడుకలను కూడా ఈ సెట్ లో జరపాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. అలాగే ఈ సెట్ లో ఇంకా ఈ సినిమా ప్రమోషన్స్ చాలా చేయొచ్చు అని కూడా అంటున్నారు. ఇవన్నీ కాకుండా వైజాగ్ లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా వుంది. ఇలా ఈ సినిమా ప్రమోషన్స్ ఎక్కడా తగ్గకుండా సంక్రాంతి పండగకి మెగా అభిమానులు కాలరు ఎత్తుకునేలా చెయ్యాలని చిరంజీవి గారు స్వయంగా ఈ ప్రమోషన్స్ అన్నిటినీ పర్యవేఖిస్తున్నారనీ కూడా తెలిసింది. ఇక సంక్రాంతి అంత 'మెగా మరియు మాస్' పండగ జరుపుకోనున్నారు. పూనకాలు లోడింగ్!

Updated Date - 2022-12-29T15:07:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!