Hindi-Telugu bilingual: ఠాగూర్ మధు, నిఖిల్ తో పీరియడ్ డ్రామా
ABN , First Publish Date - 2022-12-12T16:17:10+05:30 IST
ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు (Producer Tagore Madhu) ఒక హై బడ్జెట్ సినిమాతో మళ్ళీ వస్తున్నారు. ఈసారి ఒక పీరియడ్ డ్రామా ప్లాన్ చేసినట్టుగా సమాచారం.

ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు (Producer Tagore Madhu) ఒక హై బడ్జెట్ సినిమాతో మళ్ళీ వస్తున్నారు. ఈసారి ఒక పీరియడ్ డ్రామా ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఇందులో 'కార్తికేయ 2' (Karthikeya 2) తో భారతదేశం అంతా హిట్ కొట్టిన నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) తో చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించాం నున్నట్టు గా కూడా సమాచారం. (It's a Hindi-Telugu bilingual) నిఖిల్ ఇంతకు ముందు ఠాగూర్ మధు తో 'అర్జున్ సురవరం' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి లాభాలను కూడా తెచ్చి పెట్టింది. మాలీ అదే ఠాగూర్ మధు, నిఖిల్ ఈ పీరియడ్ డ్రామా కోసం చేతులు కలుపుతున్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలు పెట్టాలని కూడా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందింది. అయితే ఈ సినిమాని ఠాగూర్ మధు చాల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్టుగా కూడా తెలిసింది. పదకొండవ శతాబ్దంలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది అని కూడా తెలిసింది. ఈ సినిమా కథలో చిన్న పౌరాణిక స్పర్శ (Mythical touch) కూడా ఉంటుంది అని తెలిసింది.
అయితే అది పెద్దగా కాకుండా, చిన్నగా మాత్రమే చూపిస్తారు అని కూడా తెలిసింది. ఇందులో అతీంద్రీయ శక్తులకు (Supernatural thing) సంబంధించి కూడా ఏమి ఉండదు అని కథ మాత్రం అప్పట్లో జరిగింది అని మాత్రం తెలిసింది. ఈ సినిమాకి ఠాగూర్ మధు చాల పెద్ద బడ్జెట్ కేటాయిస్తున్నట్టు కూడా తెలిసింది. 'మగధీర' సినిమా లో ఉన్నట్టు కొంచెం ఆ గ్రహాలు కలవటం, జ్యోతిష్యం లాంటివి ఉంటాయి తప్పితే, సినిమాలో ఎక్కడా అతీంద్రీయ శక్తులు ఎక్కువ కనపడవు అని కూడా తెలిసింది. ఈ సినిమా తో ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఈ సినిమా కథ భారత దేశానికీ, లంక కి వున్న సంబధం గురించి కొంచెం టచ్ చేస్తారని కూడా తెలిసింది. నిర్మాత ఠాగూర్ మధు, లీడ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ చాలా ఆసక్తికరంగా వుండబోతోంది అని అనుకుంటున్నట్టు గా తెలిసింది.
Read more