Sreeleela: ‘మన అమ్మాయి’ అనే వైబ్ ఇచ్చారు

ABN , First Publish Date - 2022-12-21T21:12:55+05:30 IST

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్

Sreeleela: ‘మన అమ్మాయి’ అనే వైబ్ ఇచ్చారు
Sreeleela

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ (Dhamaka). రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతన్న సందర్భంగా హీరోయిన్ శ్రీలీల.. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. (Sreeleela Interview)

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

దర్శకుడు త్రినాథరావు నక్కిన.. తన గత చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అప్పుడే రచయిత ప్రసన్న కూడా పరిచయమయ్యారు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. పెళ్లి సందడి విడుదల కాకముందే ‘ధమాకా’ కథ చెప్పారు. కథ చెప్పిన పది నిమిషాలకే ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాను. ‘ధమాకా’ మంచి ఎంటర్‌టైనర్. హిలేరియస్‌గా వుంటుంది. నాకు ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలంటే చాలా ఇష్టం.

తక్కువ సమయంలోనే రవితేజ వంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ రావడం నిజంగా గ్రేట్ ఫుల్ ఫీలింగ్. కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao)‌గారి సినిమాతో లాంచ్ కావడం తర్వాత రవితేజ‌గారితో ధమాకా లాంటి బ్యూటీఫుల్ ప్రాజెక్ట్ చేయడం చాలా లక్కీగా వుంది. రోజూ దేవుడికి థాంక్స్ చెప్పుకుంటాను. మొదటి సినిమా అంతా కొత్తవారితో జరిగిపోయింది. రెండో సినిమా స్టార్ హీరో‌తో కావడంతో మొదట చాలా టెన్షన్ పడ్డా. మొదట్లో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఆయనతో పని చేస్తుంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. రవితేజ‌గారు చాలా మోటివేట్ చేస్తారు. ఆయనతో పని చేయడంలో ఒక కంఫర్ట్ వుంటుంది. సెట్‌లో చాలా సపోర్ట్ చేస్తారు. రవితేజ‌గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. ఆయన్ని మొదటిసారి సెట్‌లో చూసినప్పుడు ఒక సర్‌ప్రైజ్ ఫీలింగ్. పాత్రలో వేరియేషన్స్‌ని చాలా ఈజీగా చూపించగలరు. ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారని ఆయనని అడుగుతుంటాను. ‘విక్రమార్కుడు’ డ్యుయల్ రోల్ ఎంత అవుట్ స్టాండింగ్‌గా చేశారో.. ధమాకాలో అంతే అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో ఆయన ఎనర్జీని మ్యాచ్ చేశానో లేదో.. రేపు సినిమా చూశాక ప్రేక్షకులే చెప్పాలి. డ్యాన్సులు చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. నాకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే ఇష్టం. డ్యాన్స్ నేర్చుకున్నాను.

దర్శకుడు త్రినాథరావు నక్కిన గత చిత్రాలు చూశాను. ‘నేను లోకల్’ (Nenu Local) పాటలు బెంగళూర్‌లో ఉన్నప్పుడు తెగ వినేదాన్ని. అందులో కీర్తి సురేష్ (Keerthi Suresh) గారి పాత్ర నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. ఆయన చాలా పాజిటివ్ పర్సన్. ‘ధమాకా’లో జింతాక్ పాట బాగా నచ్చింది. తర్వాత వాట్స్ హ్యాపెనింగ్ పాట. అందులో వయోలిన్ బిట్ చాలా ఇష్టం. ఇందులో ప్రణవి అనే పాత్రలో కనిపిస్తా. డబల్ రోల్ తో ట్రావెల్ అయినప్పుడు ఒక కన్ఫ్యూజన్ వుంటుంది. ఇద్దరూ ఇష్టం అంటే.. ముగింపు ఎలా వుంటుందనేది ఇందులో ట్విస్ట్ ఫ్యాక్టర్.

స్పెయిన్‌లో జింతాక్ పాట షూట్ చేసినప్పుడు రేపు షూటింగ్ అనగా నా కాస్ట్యుమ్ బ్యాగ్ పోయింది. చాలా టెన్షన్ పడ్డాను. ఐతే మేము వుండే లొకేషన్ నుండి మూడు గంటలు ప్రయాణించి మా డీవోపీ, డైరెక్టర్ వేరేవేరే ప్రదేశాలకు వెళ్లి అక్కడ నా కోసం షాపింగ్ చేసి అక్కడ నుండి ఫోటోలు పెట్టి ఓకే చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం షాపింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అదొక మంచి క్యూట్ మూమెంట్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. కొన్ని సందర్భాల్లో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ‘మన అమ్మాయి’ అనే వైబ్ ఇచ్చారు. వారి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ధమాకా విడుదల కోసం చాలా ఎక్జయిటెడ్‌గా ఎదురుచూస్తున్నాను. అదే సమయంలో లోపల కాస్త టెన్షన్ కూడా వుంది.

నేను బేసిగ్గా స్విచ్ఛాన్ స్విచ్ఛాఫ్ పర్సన్‌ని. యాక్టర్ అన్నప్పుడు అందరి దృష్టి వుంటుంది. మెడిసిన్ చదువు విషయానికి వస్తే .. అక్కడ మనల్ని మనలానే వదిలేస్తారు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ఇష్టం. షూటింగ్ నుండి వచ్చినా ఇంట్లో చదువుకుంటాను.

ప్రస్తుతం బాలకృష్ణ (Balakrishna)గారు, అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా ఇటివలే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే బోయపాటి-రామ్ గారి సినిమా కూడా చేస్తున్నాను. వైష్ణవ్ తేజ్‌గారితో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే వారాహి ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాను. నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఇంకొన్ని సినిమాలు వున్నాయి. నిర్మాణ సంస్థలు ప్రకటిస్తాయి.

Updated Date - 2022-12-21T21:14:25+05:30 IST