Waltair Veerayya: పూనకాలు లోడింగ్.. ఇంకా ఒక్క రోజే!

ABN , First Publish Date - 2022-12-29T16:16:49+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) పాత్రలను పరిచయం చేస్తూ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) మేకర్స్..

Waltair Veerayya: పూనకాలు లోడింగ్.. ఇంకా ఒక్క రోజే!
Chiranjeevi and Ravi Teja

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) పాత్రలను పరిచయం చేస్తూ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) మేకర్స్ రెండు విభిన్న ప్రోమోలను విడుదల చేశారు. టీమ్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటల్లోనూ మెగాస్టార్ చిరంజీవి అలరించారు. ఇప్పుడు మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజలని కలిసి చూసే సమయం వచ్చింది. చిరంజీవి, రవితేజ కలిసి నటించిన పూనకాలు లోడింగ్ (Poonakaalu Loading) పాట డిసెంబర్ 30న విడుదల కానుంది. ఈ పాటతో.. రెండు రోజుల ముందుగానే వారు న్యూ ఇయర్ గిఫ్ట్ (New Year Gift)ని అందిస్తున్నారు. ఈ విషయం తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ అనౌన్స్‌మెంట్ పోస్టరే పూనకాలు తెప్పించేస్తోంది. అందులో చిరంజీవి, రవితేజ ఒకరినొకరు ఫెరోషియస్‌గా చూస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో జాతర వాతావరణం కనిపిస్తోంది. పోస్టర్‌లో చిరంజీవి, రవితేజ కాంట్రాస్ట్ లుక్‌‌లో కనిపిస్తున్నారు. చిరు టైటిల్ రోల్‌‌లో కనిపిస్తుండగా, రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. మెగా మాస్ పూనకాలు చూడాలంటే ఇంకో రోజు ఆగాలి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌‌ని స్కోర్ చేశాడు. రాబోయే నాలుగో పాట ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి మెగా మాస్ సాంగ్‌ ఆఫ్ ది ఇయర్ (Song of the Year) కాబోతోందని చిత్రబృందం భావిస్తోంది. కాగా.. బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌‌తో రూపొందుతోంది. చిరంజీవి సరసన శృతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఈ సినిమా 13 జనవరి, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2022-12-29T16:19:52+05:30 IST