Farzi: ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ నుంచి మరో వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2022-12-14T20:50:06+05:30 IST

ఫ్యామిలీ మ్యాన్ (Family Man) ప్రాంచైజీని క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న మేకర్స్ రాజ్ (Raj), డీకే (DK). ఈ వెబ్‌సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యి సంచలనం సృష్టించింది. ఈ మేకర్స్ నుంచే మరో షో ‘ఫర్జి’ (Farzi) టైటిల్‌తో రాబోతుంది.

Farzi: ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ నుంచి మరో వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఫ్యామిలీ మ్యాన్ (Family Man) ప్రాంచైజీని క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న మేకర్స్ రాజ్ (Raj), డీకే (DK). ఈ వెబ్‌సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యి సంచలనం సృష్టించింది. ఈ మేకర్స్ నుంచే మరో షో ‘ఫర్జి’ (Farzi) టైటిల్‌తో రాబోతుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఈ వెబ్‌సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, కెకె. మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌తోనే షాహిద్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ షో త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

‘ఫర్జి’ వెబ్‌సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కానుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ‘‘ఫర్జి వెబ్‌సిరీస్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. సిరీస్ ప్రీమియర్‌కు నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు’’ అని ప్రాజెక్టుతో సంబంధమున్న వ్యక్తి తెలిపారు. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో తన సంతోషాన్ని షాహిద్ కపూర్ గతంలోనే మీడియాతో పంచుకున్నాడు. ‘‘వెబ్‌సిరీస్ అనేది సినిమాల కంటే భిన్నమైనది. ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఛాలెంజింగ్, కొత్త కథలు చేయాలనే ఆలోచన నాకు గతం నుంచి ఉంది. ప్రేక్షకులు ఈ వెబ్‌సిరీస్ చూసి సంతోషిస్తారనుకుంటున్నాను’’ అని షాహిద్ కపూర్ చెప్పాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. షాహిద్ కపూర్ చివరగా ‘జెర్సీ’ లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. కృతి సనన్‌తో ఓ రొమాంటిక్ కామెడీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అలీ అబ్బాస్ డైరెక్షన్‌లో ‘బ్లడీ డాడీ’ లో నటించనున్నాడు. అనీస్ బజ్మీ తోను ఓ సినిమా చేయనున్నాడు.

Updated Date - 2022-12-14T20:50:08+05:30 IST