10. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన 'ఖుషి' కొన్ని ఏరియాల్లో సరిగ్గా నడవలేదు, కానీ ఈ సంవత్సరం టాప్ టెన్ గా నిలిచింది

9. 'బేబీ' ఒక చిన్న సినిమా పెద్ద విజయం సాధించి, సంచలనం సృష్టించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకుడు

8. మోటారు సైకిల్ మీదనుంచి పడిపోయి పెద్ద ప్రమాదం నుండి బతికి బయట పడ్డ సాయి ధరమ్ తేజ్ కి ఒక అద్భుతమైన విజయం ఇచ్చిన సినిమా విరూపాక్ష 

7. ఈ సంవత్సరం రెండో విజయం నమోదు చేసుకున్న బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల బాలకృష్ణ కుమార్తెగా వేసి ప్రశంసలు పొందింది. ఇది టాప్ సెవెన్ గా నిలిచింది 

6. తమిళ సినిమా 'వినోదయ సితం' రీమేక్ చేసి మొదటిసారిగా మామ అల్లుళ్ళు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' టాప్ సిక్స్ గా నిలిచింది 

5. నాని చేసిన ఈ 'దసరా' సినిమా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన కథ. శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఇది టాప్ ఫైవ్ గా నిలబడింది 

4. తమిళ నటుడు ధనుష్ మొదటిసారిగా చేసిన తెలుగు సినిమా 'సర్'. వెంకీ అట్లూరి దర్శకుడు, తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా టాప్ ఫోర్ గా నిలిచింది 

3. ఈ సంవత్సరం తొలి విజయం నందమూరి బాలకృష్ణదే. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు, టాప్ త్రి గా నిలిచింది

2. వయసు పైబడింది, చిరంజీవి పని అయిపోయింది అనేవాళ్ళకి ఒక చెంపపెట్టులా సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' చాలా పెద్ద విజయం సాధించి నెంబర్ టూ గా నిలిచింది. 

1. ప్రభాస్, కృతి సనన్ నటించిన 'ఆదిపురుష్' బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలం అయింది, కానీ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్స్ తో పోలిస్తే అగ్రస్థానంలో వుంది.