507f4fa8-9dde-4cf4-b54d-e2b8e313c43d-Nithya Menen Pic (13).jpg

ఎంత పెద్ద ఛాన్స్ అయినా సరే.. మసాలా చిత్రాల్లో నటించను

7a908398-3936-46c4-aab2-12e4921bc817-Nithya Menen Pic (7).jpg

తమిళ చిత్రం ‘తిరుచిత్రంబలం’కి గాను ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డు అందుకొని ఫుల్‌ జోష్‌లో ఉన్నారు నిత్యామీనన్‌.

07d88633-ac84-471e-b194-020c69d7db36-Nithya Menen Pic (8).jpg

ప్రస్తుతం ‘కాదలిక్క నేరమిల్లై’, ‘డియర్‌ ఎక్సెస్‌’, ధనుశ్‌తో ‘డీడీ4’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాల్లో నటిస్తున్నారు.

1a1090d4-52d5-4f1f-b0d3-627fce48c187-Nithya Menen Pic (2).jpg

తాజాగా నిత్యామీనన్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంటానని కలలో కూడా ఊహించలేదు.

నేను పోషించే ప్రతీ పాత్రకూ గుర్తింపు రావాలని కోరుకునే మనస్తత్వం కాదు నాది. 

నాకు సంతృప్తినిచ్చే పాత్రలనే ఎన్నుకోవడానికి ఇష్టపడతా. 

భారీ బడ్జెట్‌తో తీసే మసాలా చిత్రాల్లో ఎంత పెద్ద అవకాశం వచ్చినా నో చెప్పేస్తా.

అలాంటి మసాలా పాత్రలు పోషించడం నాకు ఇష్టం లేదు.

పాత్ర మంచిదైతే అది చిన్న సినిమా అయినా వెంటనే అంగీకరిస్తాను. 

మంచి కథలు రాసి.. నాలోని నటికి సవాలు విసిరే పాత్రలను సృష్టించే దర్శకులతో పనిచేయాలని ఉంది.

ఇన్నాళ్ల నా కెరీర్‌లో నేను ఇప్పటిదాకా చేసింది చాలా తక్కువ.. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది.

బాలీవుడ్‌లో దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో నటించాలని ఉందని నిత్యా తెలిపింది.